ఏపీ సీఎంతో కేంద్ర బృందం భేటీ

మొంథా తుపాను ప్ర‌భావంపై అధ్య‌యనం

అమ‌రావ‌తి : ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడుతో కేంద్ర అధికారుల‌తో కూడిన బృందం మంగ‌ళ‌వారం అమ‌రావ‌తి లోని స‌చివాల‌యంలో భేటీ అయ్యింది. ఇటీవల రాష్ట్రంపై భారీ ఎత్తున విరుచుకు ప‌డింది మొంథా తుపాను. పెద్ద ఎత్తున ఆస్తి న‌ష్టం వాటిల్లింది. ఏకంగా 20 ల‌క్ష‌ల ఎక‌రాల‌కు పైగా పంట‌లు కోల్పోయిన‌ట్లు ప్రాథ‌మిక అంచ‌నా. ఇదిలా ఉండ‌గా ఏపీపీసీసీ చీఫ్ వైఎస్ ష‌ర్మిలా రెడ్డి రూ. 20 వేల కోట్ల న‌ష్ట‌ప‌రిహారం చెల్లించాల‌ని కేంద్రాన్ని డిమాండ్ చేశారు. ఇదిలా ఉండ‌గా కేంద్రం శీత‌క‌న్ను ప్ర‌ద‌ర్శిస్తోంద‌ని ఆరోపించారు. ఇదిలా ఉండగా ఏ ఒక్క‌రికీ న‌ష్టం జ‌ర‌గ‌కుండా స‌ర్కార్ ఆదుకుంటుంద‌ని స్ప‌ష్టం చేశారు సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు.

ఇదిలా ఉండ‌గా విరుచుకుపడిన‌ మొంథా తుపాను నష్టంపై అంచనాలు రూపొందించేందుకు రాష్ట్రంలో పర్యటించింది కేంద్ర టీం. ఈ సంద‌ర్బంగా ప్ర‌త్యేకంగా నారా చంద్ర‌బాబు నాయుడితో భేటీ అయ్యింది. కాగా కేంద్ర హోంశాఖ సంయుక్త కార్యదర్శి పాసుమీ బసు ఈ బృందానికి నేతృత్వం వహిస్తున్నారు. కోనసీమ, తూర్పుగోదావరి, ఏలూరు, కృష్ణా, ప్రకాశం, బాపట్ల జిల్లాల్లో వేర్వేరు ప్రాంతాలను కేంద్ర బృందం సందర్శించింది. రూ.5,267 కోట్ల మేర తుపాను నష్టం వాటిల్లినట్టు రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి ఇప్పటికే ఓ మధ్యంతర నివేదిక ఇచ్చింది. తక్షణ సాయంగా రూ.2,622 కోట్లను మంజూరు చేయాలని కేంద్రాన్ని కోరారు ఈ సంద‌ర్బంగా సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు.

  • Related Posts

    రాబోయే భ‌విష్య‌త్తును నిర్దేశించేది ఏఐనే

    చెన్నై : : ‘దేశమే ప్రథమం’ అనే సూత్రానికి కట్టుబడి, తమ జ్ఞానం, ఆవిష్కరణలు , నైపుణ్యాలను దేశ నిర్మాణానికి వినియోగించాలని ఉప రాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్ పట్టభద్రులను కోరారు. చెన్నై సమీపంలోని కట్టంకుళత్తూరులో ఉన్న ఎస్.ఆర్.ఎం. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్…

    తెలంగాణ ‘సేఫ్’ డైర‌క్ట‌ర్ గా అవినాష్ మొహంతి

    హైద‌రాబాద్ : తెలంగాణ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఇప్ప‌టికే స‌మ‌ర్థ‌వంత‌మైన పోలీస్ ఆఫీస‌ర్ గా గుర్తింపు పొందారు అవినాష్ మొహంతి. ఆయ‌న‌కు కీల‌క ప‌ద‌వి క‌ట్ట‌బెట్టింది . సేఫ్ డైరెక్ట‌ర్ గా నియ‌మించింది. గతంలో తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *