ప్ర‌శాంత వాతావ‌ర‌ణంలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక

హైద‌రాబాద్ న‌గ‌ర పోలీస్ క‌మిష‌న‌ర్ వీసీ స‌జ్జ‌నార్

హైద‌రాబాద్ : జూబ్లీహిల్స్ ఉపఎన్నిక పోలింగ్ సరళిని హైద‌రాబాద్ న‌గ‌ర పోలీస్ క‌మిష‌న‌ర్ క‌మాండ్ కంట్రోల్ సెంట‌ర్ నుంచి పరిశీలించారు. డ్రోన్స్ ద్వారా పోలింగ్ స్టేషన్ల వద్ద పరిస్థితిని వీక్షించారు. జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నిక పోలింగ్‌ ప్రశాంత వాతావరణంలో జరిగింద‌ని చెప్పారు. ప్రజలు స్వేచ్ఛాయుత వాతావరణంలో ఓటు హక్కును వినియోగించుకునేలా పోలింగ్‌ కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశామ‌ని చెప్పారు వీసీ స‌జ్జ‌నార్. మొత్తం 900 సీసీటీవీ కెమెరాల ద్వారా పోలింగ్‌ స్టేషన్లను ఐసీసీసీ నుండి రియల్‌టైమ్ మానిటరింగ్ చేశామ‌న్నారు.

దేశంలోనే తొలిసారిగా ఈ ఎన్నికకు డ్రోన్‌ టెక్నాలజీ ద్వారా ఓటింగ్‌ ప్రక్రియను పర్యవేక్షించ‌డం జ‌రిగింద‌ని చెప్పారు. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు మొత్తం 150 డ్రోన్ కెమెరాలను ఉపయోగిస్తున్నామ‌ని వెల్ల‌డించారు ఏసీ సజ్జ‌నార్. ప్రతి ఒక్కరు స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించు కోవాలని హైదరాబాద్ సిటీ పోలీస్ తరపున కోరుతున్నామ‌ని అన్నారు. బ‌య‌ట జ‌రుగుతున్న ప్ర‌చారాన్ని ఆయ‌న కొట్టి పారేశారు. అత్యంత ప‌క‌డ్బందీగా సెక్యూరిటీ ఏర్పాటు చేశామ‌ని చెప్పారు వీసీ స‌జ్జ‌నార్.

  • Related Posts

    రాబోయే భ‌విష్య‌త్తును నిర్దేశించేది ఏఐనే

    చెన్నై : : ‘దేశమే ప్రథమం’ అనే సూత్రానికి కట్టుబడి, తమ జ్ఞానం, ఆవిష్కరణలు , నైపుణ్యాలను దేశ నిర్మాణానికి వినియోగించాలని ఉప రాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్ పట్టభద్రులను కోరారు. చెన్నై సమీపంలోని కట్టంకుళత్తూరులో ఉన్న ఎస్.ఆర్.ఎం. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్…

    తెలంగాణ ‘సేఫ్’ డైర‌క్ట‌ర్ గా అవినాష్ మొహంతి

    హైద‌రాబాద్ : తెలంగాణ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఇప్ప‌టికే స‌మ‌ర్థ‌వంత‌మైన పోలీస్ ఆఫీస‌ర్ గా గుర్తింపు పొందారు అవినాష్ మొహంతి. ఆయ‌న‌కు కీల‌క ప‌ద‌వి క‌ట్ట‌బెట్టింది . సేఫ్ డైరెక్ట‌ర్ గా నియ‌మించింది. గతంలో తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *