newsseals.com
News

ఏపీలో రీన్యూ కంపెనీ రూ. 60 వేల కోట్ల పెట్టుబ‌డి

VijayaBhaskar November 13, 2025
neewsseals-APCM
Spread the love

సీఎం చంద్రబాబు సమ‌క్షంలో కీల‌క ఒప్పందం

విశాఖ‌ప‌ట్నం జిల్లా : ఏపీ స‌ర్కార్ దూకుడు పెంచింది. రేపు, ఎల్లుండి రెండు రోజుల పాటు ప్ర‌తిష్టాత్మ‌క‌మైన సీఐఐ భాగ‌స్వామ్య స‌ద‌స్సు 2025 విశాఖ న‌గ‌రం వేదిక‌గా ప్రారంభం కానుంది. ఇందులో భాగంగా గురువారం పెద్ద ఎత్తున కంపెనీల‌తో కీల‌క‌మైన ఒప్పందాల‌ను చేసుకుంది కూట‌మి ప్ర‌భుత్వం. ఈ మేర‌కు సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు స‌మ‌క్షంలో మంత్రి నారా లోకేష్ , రీ న్యూ కంపెనీ చైర్మ‌న్ , చీఫ్ ఫైనాన్షియ‌ల్ ఆఫీస‌ర్ సుమంత్ సిన్హా ఆధ్వ‌ర్యంలో రూ. 60 వేల కోట్ల పెట్టుబ‌డుల కోసం ఒప్పందం చేసుకున్నారు. ఇందులో భాగంగా నాలుగు ప్ర‌ధాన ప్రాజెక్టులు చేప‌ట్ట‌నున్నారు.

ఇది మే 2025 లో రీ న్యూ ఇప్పటికే చేసిన ₹22,000 కోట్లపై నిర్మించ బడింది. ఈ పెట్టుబడులలో 6GW సోలార్ ఇంగోట్, వేఫర్ తయారీ సౌకర్యం, 300KTPA గ్రీన్ అమ్మోనియా ప్లాంట్, 2GW పంప్డ్ హైడ్రో ప్రాజెక్ట్ , 5GW పునరుత్పాదక ఇంధన విద్యుత్ ప్లాంట్ ఉన్నాయి. ఈ చొరవలు క్లీన్ ఎనర్జీ పరివర్తనలో ఆంధ్రప్రదేశ్ నాయకత్వాన్ని ముందుకు తీసుకు వెళతాయి. రాష్ట్ర నైపుణ్యం కలిగిన యువతకు గణనీయమైన అవకాశాలను సృష్టిస్తాయని స్పష్టం చేశారు సీఎం నారా చంద్రబాబు నాయుడు. ఇక సీఐఐ భాగ‌స్వామ్య స‌ద‌స్సులో రూ. 10 ల‌క్ష‌ల కోట్ల పెట్టుబ‌డులు వ‌స్తాయ‌ని భావిస్తున్న‌ట్లు తెలిపారు.