రాజ‌కీయాల్లో గెలుపు ఓట‌ములు స‌హ‌జం

రాబోయే కాలం మ‌న‌దేన‌న్న ఈట‌ల రాజేంద‌ర్

హైద‌రాబాద్ : రాజ‌కీయాల‌లో గెలుపు ఓట‌ములు స‌హ‌జ‌మ‌ని , ప‌ని చేసుకుంటూ పోవాల‌ని పార్టీ శ్రేణుల‌కు సూచించారు బీజేపీ ఎంపీ ఈట‌ల రాజేంద‌ర్. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక‌ల్లో బీజేపీ అభ్య‌ర్థి ఓడి పోవ‌డం, డిపాజిట్ రాక పోవ‌డం ప‌ట్ల స్పందించారు. తెలంగాణ వచ్చిన తరువాత 9 ఉప ఎన్నికలు జరిగితే 7 సార్లు అధికార పార్టీనే గెలిచిందని చెప్పారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగిన రెండు ఎన్నికల్లో హ‌స్తం గెలిచింద‌ని అన్నారు ఎంపీ. జూబ్లీహిల్స్ ఎన్నికల్లో అధికార పార్టీ అనేక ప్రలోభాలు పెట్టీ మరీ గెలిచారంటూ ఆరోపించారు. కేసీఆర్ ఎన్ని చేశారో వీరు కూడా అవే చేశారని అన్నారు. కాంగ్రెస్ కి హుజురాబాద్ లో 3016 ఓట్లు వ‌చ్చాయ‌ని, దుబ్బాకలో , మునుగోడు డిపాజిట్ కోల్పోయింద‌న్నారు. మరి డిపాజిటు కోల్పోయిన పార్టీ మొన్న ఎలా అధికారంలోకి వచ్చింది. ఒక్క బై ఎలక్షన్ ఓడిపోగానే బీజేపీ పని అయిపోతుందా ? రాజకీయ పరిజ్ఞానం ఉన్న వారు ఎవరూ అలా మాట్లాడరని అన్నారు ఈట‌ల రాజేంద‌ర్.

బీహార్ ఎన్నికలు ఒక ప్రభంజనం అన్నార‌. మ‌హా ఘ‌ట్ బంధ‌న్ అడ్ర‌స్ లేకుండా పోయింద‌న్నారు ఎంపీ.
ఒళ్ళు వంచి పని చేస్తే విజయం మనదే న‌ని ప్ర‌క‌టించారు. కార్యకర్తలు, నాయకులు సోషల్ మీడియాలో వచ్చే పోస్టులు చూసి బాధ‌కు గురి కావ‌ద్ద‌ని కోరారు . జూబ్లీహిల్స్ ఎన్నిక ఫలితం అందరం బాధ్యత తీసుకుంటున్నామ‌ని చెప్పారు. ప్రజలకు సేవ చేయడం వల్లనే దేశ వ్యాప్తంగా బీజేపీకి ప్రజలు ఓట్లు వేస్తున్నారని అన్నారు ఈట‌ల రాజేంద‌ర్. గెలిస్తే బీజేపీ వాళ్ళు EVM లను ఏదో చేశారని అంటున్నారు.. మరి జూబ్లీహిల్స్ లో ఇవిఎం మేనేజ్ చేశారా ? దొంగ ఓట్లు నమోదు చేయించారా అని ప్ర‌శ్నించారు. తెలంగాణలో, కర్ణాటకలో కూడా మీరే గెలిచారు మరి అక్కడ కూడా అలానే చేశారా ? మీరు గెలిస్తే ఒక న్యాయం.. మేము గెలిస్తే ఓట్ చోరీ అని అంటారా ? ఏం చేస్తావో ప్రజలకు చెప్పి ఓట్లు అడగాలి. ఇలాంటి ఆరోపణలు కాదు. బరిగీసి కొట్లాడే తత్వం లేనప్పుడు పార్టీ ముందుకు పోయే అవకాశం లేదన్నారు.

  • Related Posts

    రాబోయే భ‌విష్య‌త్తును నిర్దేశించేది ఏఐనే

    చెన్నై : : ‘దేశమే ప్రథమం’ అనే సూత్రానికి కట్టుబడి, తమ జ్ఞానం, ఆవిష్కరణలు , నైపుణ్యాలను దేశ నిర్మాణానికి వినియోగించాలని ఉప రాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్ పట్టభద్రులను కోరారు. చెన్నై సమీపంలోని కట్టంకుళత్తూరులో ఉన్న ఎస్.ఆర్.ఎం. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్…

    తెలంగాణ ‘సేఫ్’ డైర‌క్ట‌ర్ గా అవినాష్ మొహంతి

    హైద‌రాబాద్ : తెలంగాణ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఇప్ప‌టికే స‌మ‌ర్థ‌వంత‌మైన పోలీస్ ఆఫీస‌ర్ గా గుర్తింపు పొందారు అవినాష్ మొహంతి. ఆయ‌న‌కు కీల‌క ప‌ద‌వి క‌ట్ట‌బెట్టింది . సేఫ్ డైరెక్ట‌ర్ గా నియ‌మించింది. గతంలో తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *