అమ‌రావ‌తి రైతులు అధైర్య ప‌డ‌వ‌ద్దు

కేంద్ర మంత్రి పెమ్మ‌సాని చంద్ర‌శేఖ‌ర్

అమ‌రావ‌తి : సాధ్య‌మైనంత త్వ‌ర‌లోనే అమ‌రావ‌తి రాజ‌ధాని రైతులు ఎదుర్కొంటున్న స‌మ‌స్య‌ల‌కు ప‌రిష్కారం చూపిస్తామ‌ని ప్ర‌క‌టించారు కేంద్ర మంత్రి డాక్ట‌ర్ పెమ్మ‌సాని చంద్ర‌శేఖ‌ర్. శ‌నివారం స‌చివాల‌యంలో రాజ‌ధాని రైతుల స‌మ‌స్య‌ల‌పై ఏర్పాటైన క‌మిటీ స‌మావేశ‌మైంది. ఈ స‌మావేశానికి కేంద్ర మంత్రితో పాటు రాష్ట్ర మంత్రి పొంగూరు నారాయ‌ణ‌, సీఆర్డీఏ ఉన్న‌తాధికారులు హాజ‌ర‌య్యారు. ఈ సంద‌ర్భంగా కీల‌క సూచ‌న‌లు చేశారు కేంద్ర మంత్రి. ఆరు నెల‌ల కాలంలోనే అన్ని స‌మ‌స్య‌ల‌కు ప‌రిష్కారం దొరుకుతుంద‌న్నారు. మ‌రోసారి భూములు కోల్పోయిన వారికి సంబంధించి ప‌రిహారం చెల్లించ‌డంతో పాటు ఇత‌ర స‌మ‌స్య‌లు ఏవైనా ఉన్నా వాటిని ప‌రిష్క‌రిస్తామ‌న్నారు.

గ్రామ కంఠాలకు సంబంధించి 370 మంది రైతులకు ఇబ్బంది ఉందన్నారు. లంక భూముల విషయం గ్రీన్ ట్రిబ్యునల్ లో కేసు పెండింగ్ లో ఉందని చెప్పారు డాక్ట‌ర్ పెమ్మ‌సాని చంద్ర‌శేఖ‌ర్. లంక భూముల్లో ఎలాంటి అభివృద్ధి చేయడానికి వీలు లేదన్నారు. గ్రీన్ ట్రిబ్యునల్ లో ఫిబ్రవరి లో కేసు విచారణ జ‌రుగుతుంద‌న్నారు. అయితే అసైన్డ్ భూముల అంశం కేబినెట్ సబ్ కమిటీ పరిధిలో ఉందని చెప్పారు. 90 రోజుల్లోగా ఈ సమస్యను పరిష్కరిస్తాం అన్నారు. జనవరి నుంచి 25 గ్రామాల్లో మౌళిక వసతుల కల్పన ప్రారంభిస్తామ‌ని ప్ర‌క‌టించారు పెమ్మ‌సాని చంద్ర‌శేఖ‌ర్.

  • Related Posts

    రాబోయే భ‌విష్య‌త్తును నిర్దేశించేది ఏఐనే

    చెన్నై : : ‘దేశమే ప్రథమం’ అనే సూత్రానికి కట్టుబడి, తమ జ్ఞానం, ఆవిష్కరణలు , నైపుణ్యాలను దేశ నిర్మాణానికి వినియోగించాలని ఉప రాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్ పట్టభద్రులను కోరారు. చెన్నై సమీపంలోని కట్టంకుళత్తూరులో ఉన్న ఎస్.ఆర్.ఎం. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్…

    తెలంగాణ ‘సేఫ్’ డైర‌క్ట‌ర్ గా అవినాష్ మొహంతి

    హైద‌రాబాద్ : తెలంగాణ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఇప్ప‌టికే స‌మ‌ర్థ‌వంత‌మైన పోలీస్ ఆఫీస‌ర్ గా గుర్తింపు పొందారు అవినాష్ మొహంతి. ఆయ‌న‌కు కీల‌క ప‌ద‌వి క‌ట్ట‌బెట్టింది . సేఫ్ డైరెక్ట‌ర్ గా నియ‌మించింది. గతంలో తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *