బీజేపీ పాల‌న‌లో వేగంగా వంతెన‌ల నిర్మాణం

వెల్ల‌డించిన ఎంపీ ఈట‌ల రాజేంద‌ర్

నాగ‌ర్ క‌ర్నూల్ జిల్లా : బీజేపీ ఎంపీ ఈటల రాజేంద‌ర్ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. దివంగ‌త ప్ర‌ధాన‌మంత్రి అటల్ బిహారి వాజ్ పేయి హ‌యాంలో దేశంలో ర‌హ‌దారుల రూపు రేఖ‌లు పూర్తిగా మారి పోయాయ‌ని అన్నారు. నాగ‌ర్ క‌ర్నూల్ జిల్లాలో ఎంపీ ప‌ర్య‌టించారు. ఆయ‌న వెంట బీజేపీ సీనియ‌ర్ నేత సుధాక‌ర్ రావు, మాజీ ఎమ్మెల్యే గువ్వ‌ల బాల రాజుతో క‌లిసి కొల్లాపూర్ నియోజ‌క‌వ‌ర్గంలోని సోమ‌శిల ప్రాంతాన్ని ప‌రిశీలించారు లాంచ్ లో. 2018లో జ‌రిగిన ఎన్నిక‌ల స‌మ‌యంలో ఇక్క‌డ పార్టీ అభ్య‌ర్థిగా పోటీ చేసిన సుధాక‌ర్ రావు ప‌ట్టుప‌ట్టి సోమ‌శిల నుంచి నంద్యాల వ‌ర‌కు వంతెన నిర్మాణం కోసం హ‌మీ ఇచ్చార‌ని, ఈ మేర‌కు తాను ప‌ట్టుబ‌ట్టి మంజూరు చేయించు కున్నార‌ని ప్ర‌శంస‌లు కురిపించారు.

ఇందులో భాగంగా కేంద్ర మంత్రి నితిన్ గ‌డ్క‌రీ సైతం ఓకే చెప్పార‌ని, దీని నిర్మాణం ఖ‌ర్చు దాదాపు రూ. 3,000 కోట్లు దాకా ఉంటుంద‌న్నారు ఈట‌ల రాజేంద‌ర్. ఒక‌వేళ ఈ బ్రిడ్జి ప్రారంభం అయితే తిరుపతి వెళ్ళే వారికి 70 కిలోమీటర్ల దూరం తగ్గుతుందన్నారు. మ‌రింత వేగంగా వెళ్లేందుకు ఛాన్స్ ఉంటుంద‌న్నారు ఎంపీ. ఈ నిర్మాణం తరువాత టూరిజం పెద్ద ఎత్తున అభివృద్ధి చెందనుంద‌ని ఆశాభావం వ్య‌క్తం చేశారు.
కాగా ఇక్కడ బిజెపి అధికారంలోకి లేకపోయినా, నేతలు ఒప్పించి మెప్పించి ఈ రోడ్లు, బ్రిడ్జిలు మంజూరు చేయించారని ప్ర‌శంస‌లు కురిపించారు సుధాక‌ర్ రావుపై.

  • Related Posts

    రాబోయే భ‌విష్య‌త్తును నిర్దేశించేది ఏఐనే

    చెన్నై : : ‘దేశమే ప్రథమం’ అనే సూత్రానికి కట్టుబడి, తమ జ్ఞానం, ఆవిష్కరణలు , నైపుణ్యాలను దేశ నిర్మాణానికి వినియోగించాలని ఉప రాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్ పట్టభద్రులను కోరారు. చెన్నై సమీపంలోని కట్టంకుళత్తూరులో ఉన్న ఎస్.ఆర్.ఎం. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్…

    తెలంగాణ ‘సేఫ్’ డైర‌క్ట‌ర్ గా అవినాష్ మొహంతి

    హైద‌రాబాద్ : తెలంగాణ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఇప్ప‌టికే స‌మ‌ర్థ‌వంత‌మైన పోలీస్ ఆఫీస‌ర్ గా గుర్తింపు పొందారు అవినాష్ మొహంతి. ఆయ‌న‌కు కీల‌క ప‌ద‌వి క‌ట్ట‌బెట్టింది . సేఫ్ డైరెక్ట‌ర్ గా నియ‌మించింది. గతంలో తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *