ఐటీ రంగంలో ఎదిగేందుకు ఎన్నో అవ‌కాశాలు

స్ప‌ష్టం చేసిన మంత్రి దుద్దిళ్ల శ్రీ‌ధ‌ర్ బాబు

హైద‌రాబాద్ : ఐటీ సెక్టార్ లో కీల‌క‌మైన మార్పులు చోటు చేసుకుంటున్నాయ‌ని వాటిని ఆధారంగా చేసుకుని ముందుకు వెళ్లాల‌ని స్ప‌ష్టం చేశారు ఐటీ, ప‌రిశ్ర‌మ‌ల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీ‌ధ‌ర్ బాబు. మనం మన విధులను సక్రమంగా నిర్వర్తించినప్పుడే ప్రశ్నించే అవకాశాన్ని పొందగలమని మంత్రి ఈ సందర్భంగా అన్నారు. జేఎన్టీయూహెచ్ లో ఏఐ, క్వాంటం కంప్యూటింగ్, సైబర్ సెక్యూరిటీలో సెంటర్ ఆఫ్ ఎక్స్ లెన్స్, ఇన్నోవేషన్ అండ్ రీసెర్చ్ ఫండింగ్, రీసెర్చ్ క్లస్టర్స్, ఇంటర్నేషనల్ మెంటార్ షిప్ నెట్ వర్క్స్, గ్లోబల్ అల్యూమ్ని కౌన్సిల్ ఏర్పాటు చేసేందుకు ముందుకు రావాలని పూర్వ విద్యార్థులకు పిలుపునిచ్చారు. ఈ ప్రక్రియలో రాష్ట్ర ప్రభుత్వం తరఫున అన్ని రకాలుగా అండగా ఉంటామని మంత్రి హామీ ఇచ్చారు.

యువ ఇంజనీర్ల ఆలోచన విధానం మారాలని, ఉద్యోగార్థిగా కాకుండా పది మందికి ఉద్యోగాలిచ్చే స్థాయికి ఎదగాలని శ్రీ‌ధ‌ర్ బాబు ఈ సందర్భంగా మార్గ నిర్దేశం చేశారు. కేవలం పుస్తకజ్ఞానమే కాకుండా ప్రాక్టికల్, ప్రాబ్లం సాల్వింగ్ స్కిల్స్ పెంపొందించు కోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ ఛైర్మన్ ప్రొఫెసర్ వి. బాలకిష్టా రెడ్డి, జేఎన్టీయూహెచ్ వీసీ ప్రొఫెసర్ టి. కిషన్ కుమార్ రెడ్డి, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ కె.వెంకటేశ్వర రావు, రెక్టార్ డా. కె. విజయ్ కుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు

  • Related Posts

    రాబోయే భ‌విష్య‌త్తును నిర్దేశించేది ఏఐనే

    చెన్నై : : ‘దేశమే ప్రథమం’ అనే సూత్రానికి కట్టుబడి, తమ జ్ఞానం, ఆవిష్కరణలు , నైపుణ్యాలను దేశ నిర్మాణానికి వినియోగించాలని ఉప రాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్ పట్టభద్రులను కోరారు. చెన్నై సమీపంలోని కట్టంకుళత్తూరులో ఉన్న ఎస్.ఆర్.ఎం. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్…

    తెలంగాణ ‘సేఫ్’ డైర‌క్ట‌ర్ గా అవినాష్ మొహంతి

    హైద‌రాబాద్ : తెలంగాణ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఇప్ప‌టికే స‌మ‌ర్థ‌వంత‌మైన పోలీస్ ఆఫీస‌ర్ గా గుర్తింపు పొందారు అవినాష్ మొహంతి. ఆయ‌న‌కు కీల‌క ప‌ద‌వి క‌ట్ట‌బెట్టింది . సేఫ్ డైరెక్ట‌ర్ గా నియ‌మించింది. గతంలో తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *