జ‌న‌మే జెండా స‌మ‌స్య‌లే ఎజెండా

క‌ల్వ‌కుంట్ల క‌విత‌క్క జ‌నం బాట

వ‌న‌ప‌ర్తి జిల్లా : తెలంగాణ జాగృతి సంస్థ అధ్య‌క్షురాలు క‌ల్వ‌కుంట్ల క‌విత ప్ర‌జా స‌మ‌స్య‌ల‌పై దృష్టి సారించారు. ఇందులో భాగంగా ఇప్ప‌టికే ప‌లు జిల్లాల‌లో ప‌ర్య‌టించారు. ప్ర‌జ‌ల‌తో ముచ్చ‌టించారు. వారి స‌మ‌స్య‌ల‌ను అడిగి తెలుసుకున్నారు. ఇదే స‌మ‌యంలో హాస్ట‌ళ్ల‌ను సంద‌ర్శించారు. విద్యార్థుల‌కు భ‌రోసా ఇచ్చారు. సూసైడ్ చేసుకున్న కుటుంబాన్ని ఓదార్చారు. రిమ్స్ ఆస్ప‌త్రితో పాటు వ‌రంగ‌ల్ ఆస్ప‌త్రిని సంద‌ర్శించారు. క‌నీస వ‌స‌తులు క‌ల్పించ‌క పోవ‌డం ప‌ట్ల తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. అక్క‌డ చికిత్స పొందుతున్న రోగులను ప‌రామ‌ర్శించారు. ప్ర‌భుత్వం ప‌ట్టించుకోక పోవ‌డాన్ని తీవ్రంగా త‌ప్పు ప‌ట్టారు. ఖాళీల‌ను భ‌ర్తీ చేయాల‌ని కోరారు. పంట‌లు కోల్పోయిన రైతుల గోస విన్నారు. క‌నీస మ‌ద్ద‌తు క‌ల్పించ‌క పోవ‌డం ప‌ట్ల ఆవేద‌న వ్య‌క్తం చేశారు. కేంద్ర రాష్ట్ర ప్ర‌భుత్వాలు ఉదాసీన వైఖ‌రిని ఎండ‌గ‌ట్టారు. అకాల వ‌ర్షాలు, ఎడ‌తెగ‌ని తుపాను కార‌ణంగా పంట‌లు కోల్పోయిన రైతుల‌ను ఆదుకోవాల‌ని క‌నీసం రూ. 50 వేలు న‌ష్ట ప‌రిహారంగా ఎక‌రాకు ఇవ్వాల‌ని క‌విత డిమాండ్ చేశారు.

పాల‌మూరు జిల్లాలో ప‌ర్య‌టించిన ఆమె ఉద్దండాపూర్ నిర్వాసితుల గోడు విన్నారు. పాల‌మూరు రంగారెడ్డి ఎత్తిపోత‌ల ప‌థ‌కం 80 శాతం పూర్త‌యింద‌ని, ఇంకా 20 శాతం పూర్తి చేయ‌కుండా స‌ర్కార్ తాత్సారం చేయ‌డం ప‌ట్ల తీవ్ర స్థాయిలో మండిప‌డ్డారు క‌ల్వ‌కుంట్ల క‌విత‌. ఇది మంచి ప‌ద్ద‌తి కాద‌న్నారు. ఇదే క్రమంలో సింగ‌రేణి కంపెనీ లిమిటెడ్ లో కార్మికుల‌కు సంబంధించి ఆస్ప‌త్రిని ఏర్పాటు చేయాల‌ని డిమాండ్ చేశారు. హైద‌రాబాద్ లో ఆందోళ‌న చేప‌ట్టారు. అనంత‌రం షాద్ న‌గ‌ర్ లో ఆస్ప‌త్రిని ఆక‌స్మికంగా త‌నిఖీ చేశారు. అత్తాపూర్ , త‌దిత‌ర ప్రాంతాల‌లో ఇళ్లున్నా ప‌ట్టాలు ఇవ్వ‌క పోవ‌డం ప‌ట్ల ఆవేద‌న చెందారు. తాజాగా వ‌న‌ప‌ర్తి జిల్లాలో జాగృతి జ‌నం బాట‌లో భాగంగా ఆదివారం, సోమ‌వారం రెండు రోజుల పాటు ప‌ర్య‌టించనున్నారు. ప్ర‌జలు ఎదుర్కొంటున్న స‌మ‌స్య‌లపై ఫోక‌స్ పెట్ట‌నున్నారు. ఈ విష‌యాన్ని తెలంగాణ జాగృతి అధ్య‌క్షుడు డాక్ట‌ర్ మూర్తి వెల్ల‌డించారు.

  • Related Posts

    రాబోయే భ‌విష్య‌త్తును నిర్దేశించేది ఏఐనే

    చెన్నై : : ‘దేశమే ప్రథమం’ అనే సూత్రానికి కట్టుబడి, తమ జ్ఞానం, ఆవిష్కరణలు , నైపుణ్యాలను దేశ నిర్మాణానికి వినియోగించాలని ఉప రాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్ పట్టభద్రులను కోరారు. చెన్నై సమీపంలోని కట్టంకుళత్తూరులో ఉన్న ఎస్.ఆర్.ఎం. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్…

    తెలంగాణ ‘సేఫ్’ డైర‌క్ట‌ర్ గా అవినాష్ మొహంతి

    హైద‌రాబాద్ : తెలంగాణ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఇప్ప‌టికే స‌మ‌ర్థ‌వంత‌మైన పోలీస్ ఆఫీస‌ర్ గా గుర్తింపు పొందారు అవినాష్ మొహంతి. ఆయ‌న‌కు కీల‌క ప‌ద‌వి క‌ట్ట‌బెట్టింది . సేఫ్ డైరెక్ట‌ర్ గా నియ‌మించింది. గతంలో తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *