నాకు ప్రాణ‌హాని ఉంద‌న్న మాజీ డిప్యూటీ మేయ‌ర్

మాగంటి గోపీనాథ్ అనుచ‌రుల‌తో ప్ర‌మాదం

హైద‌రాబాద్ : మాజీ డిప్యూటీ మేయర్, బోరబండ కార్పొరేటర్ బాబా ఫ‌సియోద్దీన్ సంచ‌ల‌న‌ వ్యాఖ్యలు చేశారు. మాగంటి గోపీనాథ్ అనుచరులతో త‌న‌కు ప్రాణహాని ఉందంటూ ఆవేద‌న వ్య‌క్తం చేశారు. నన్ను చంపేస్తామని ఇటీవల మా ఇంటికి బెదిరింపు లేఖ వచ్చిందన్నారు. లేఖ పై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారని అన్నారు. నన్ను చంపేందుకు కుట్ర జరుగుతుందంటూ ఆరోపించారు. ఇందుకు సంబంధించిన లేఖ‌పై ద‌ర్యాప్తు చేయాల‌ని ఆయ‌న కోరారు. త‌న‌కు , నా కుటుంబానికి పోలీసులు ర‌క్ష‌ణ క‌ల్పించాల‌ని వేడుకున్నారు. వ్యక్తిగత కారణాలతో ఆత్మహత్యకు పాల్పడిన సర్దార్ మృతిని నాపై రుద్దే ప్రయత్నం చేశారని ఆవేద‌న వ్య‌క్తం చేశారు.

కాంగ్రెస్ పార్టీలో కోవర్టులు ఉన్నారని ఆరోపించారు. జూబ్లీహిల్స్ ఎన్నికల్లో నవీన్ యాదవ్ కు 50వేల మెజారిటీ వచ్చేదన్నారు. మెజార్టీ రాకుండా అడ్డుకున్నది కొంతమంది కాంగ్రెస్ లో ఉన్న కోవర్టులేన‌ని ఆర‌పించారు బోర‌బండ కార్పొరేటర్ బాబా ఫసియుద్దీన్. ఇదిలా ఉండ‌గా తాజాగా మాజీ డిప్యూటీ మేయ‌ర్ చేసిన కామెంట్స్ క‌ల‌క‌లం రేపుతున్నాయి ఇటు కాంగ్రెస్ పార్టీలో అటు బీఆర్ఎస్ పార్టీలో. దీనిపై ఇంకా ఎలాంటి విచార‌ణ‌కు ఆదేశించ‌లేదు స‌ర్కార్. ఇటీవ‌ల జూబ్లీహిల్స్ శాస‌న స‌భ నియోజ‌క‌వ‌ర్గానికి జ‌రిగిన ఉప ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ పార్టీ అభ్య‌ర్థి గెలుపులో కీల‌క పాత్ర పోషించాడు ఫ‌సియోద్దీన్.

  • Related Posts

    రాబోయే భ‌విష్య‌త్తును నిర్దేశించేది ఏఐనే

    చెన్నై : : ‘దేశమే ప్రథమం’ అనే సూత్రానికి కట్టుబడి, తమ జ్ఞానం, ఆవిష్కరణలు , నైపుణ్యాలను దేశ నిర్మాణానికి వినియోగించాలని ఉప రాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్ పట్టభద్రులను కోరారు. చెన్నై సమీపంలోని కట్టంకుళత్తూరులో ఉన్న ఎస్.ఆర్.ఎం. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్…

    తెలంగాణ ‘సేఫ్’ డైర‌క్ట‌ర్ గా అవినాష్ మొహంతి

    హైద‌రాబాద్ : తెలంగాణ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఇప్ప‌టికే స‌మ‌ర్థ‌వంత‌మైన పోలీస్ ఆఫీస‌ర్ గా గుర్తింపు పొందారు అవినాష్ మొహంతి. ఆయ‌న‌కు కీల‌క ప‌ద‌వి క‌ట్ట‌బెట్టింది . సేఫ్ డైరెక్ట‌ర్ గా నియ‌మించింది. గతంలో తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *