సెంట్రలైజ్డ్ కమ్యూనిటీ కిచెన్ కు భూమి పూజ

తెలంగాణ ముఖ్య‌మంత్రి ఎ. రేవంత్ రెడ్డి

వికారాబాద్ జిల్లా : అన్నార్థుల‌, విద్యార్థుల ఆక‌లిని తీర్చుతోంది అక్ష‌య‌పాత్ర ఫౌండేష‌న్. గ‌త కొన్నేళ్లుగా తెలంగాణ రాష్ట్రంలో అన్న‌దానం చేస్తోంది. ప్ర‌భుత్వంతో క‌లిసి ఒప్పందం చేసుకుంది. ప‌లు చోట్ల సెంట్ర‌లైజ్డ్ క‌మ్యూనిటీ కిచెన్ ను ఏర్పాటు చేసింది. ఇందులో భాగంగా సీఎం ఎ. రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం వ‌హిస్తున్న కోడంగ‌ల్ నియోజ‌క‌వ‌ర్గంలో అక్షయపాత్ర ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయాల‌ని ఇప్ప‌టికే నిర్ణ‌యించారు సీఎం. ఈ సంద‌ర్బంగా నిర్వహించనున్న మిడ్ డే మీల్స్ కిచెన్ ( సెంట్రలైజ్డ్ కమ్యూనిటీ కిచెన్) భవన నిర్మాణానికి భూమి పూజ చేశారు రేవంత్ రెడ్డి. ఈ కార్యక్రమంలో మంత్రులు దామోదర రాజనర్సింహ, వాకిటి శ్రీహరి, పలువురు ఎమ్మెల్యేలు, కార్పొరేషన్ చైర్మన్లు పాల్గొన్నారు.

ఈ సంద‌ర్బంగా జ‌రిగిన స‌మావేశంలో సీఎం ఎ. రేవంత్ రెడ్డి ప్ర‌సంగించారు. రాబోయే రోజుల్లో కోడంగ‌ల్ నియోజ‌క‌వ‌ర్గాన్ని రోల్ మోడ‌ల్ గా తీర్చిదిద్దుతాన‌ని ప్ర‌క‌టించారు. రూ. 103 కోట్ల విఇలువ చేసే అభివృద్ది ప‌నుల‌కు శంకుస్థాప‌న‌, భూమి పూజ చేయ‌డం మంత్రుల‌తో క‌లిసి ఆనందంగా ఉంద‌న్నారు. రాబోయే రోజుల్లో తెలంగాణ నోయిడాగా కోడంగ‌ల్ ను తీర్చుతాన‌ని చెప్పారు రేవంత్ రెడ్డి. ల‌క్ష‌లాది మందికి ఇది ఆక‌లిని తీర్చ‌డం ఖాయ‌మ‌న్నారు. రైల్వే ప్రాజెక్టు ప‌నులు కూడా ప్రారంభం అవుతాయ‌ని అన్నారు.

  • Related Posts

    రాబోయే భ‌విష్య‌త్తును నిర్దేశించేది ఏఐనే

    చెన్నై : : ‘దేశమే ప్రథమం’ అనే సూత్రానికి కట్టుబడి, తమ జ్ఞానం, ఆవిష్కరణలు , నైపుణ్యాలను దేశ నిర్మాణానికి వినియోగించాలని ఉప రాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్ పట్టభద్రులను కోరారు. చెన్నై సమీపంలోని కట్టంకుళత్తూరులో ఉన్న ఎస్.ఆర్.ఎం. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్…

    తెలంగాణ ‘సేఫ్’ డైర‌క్ట‌ర్ గా అవినాష్ మొహంతి

    హైద‌రాబాద్ : తెలంగాణ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఇప్ప‌టికే స‌మ‌ర్థ‌వంత‌మైన పోలీస్ ఆఫీస‌ర్ గా గుర్తింపు పొందారు అవినాష్ మొహంతి. ఆయ‌న‌కు కీల‌క ప‌ద‌వి క‌ట్ట‌బెట్టింది . సేఫ్ డైరెక్ట‌ర్ గా నియ‌మించింది. గతంలో తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *