newsseals.com
DEVOTIONAL

ఆలయ స్థల పురాణం పుస్తకం ఆవిష్కరణ

Posted by: VijayaBhaskar November 25, 2025
newsseals-PawanKalyan

అభివృద్ది ప‌నుల‌కు ప‌వ‌న్ క‌ళ్యాణ్ శంకుస్థాప‌న‌

అమ‌రావ‌తి : రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ త‌న మాట నిల‌ల‌బెట్టుకున్నారు. ఏలూరు జిల్లా ఐ.ఎస్. జగన్నాథపురంలోని శ్రీ కనకవల్లీ సహిత లక్ష్మీనరసింహ స్వామి వారిని దర్శించుకున్నారు. పుష్పార్చనలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయం వద్ద పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. జిల్లా ఇంఛార్జ్ మంత్రి నాదెండ్ల మ‌నోహ‌ర్ కూడా హాజ‌ర‌య్యారు. ఆలయానికి విచ్చేసిన పవన్ కళ్యాణ్ కు ఛైర్మన్ రాజ బహదూర్ నివృతరావు, ఈఓ వి.ఎస్.ఎన్. మూర్తి ఆధ్వర్యంలో వేద పండితులు పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు. ఆలయం చుట్టూ ప్రదక్షణ చేసి గర్భాలయంలో స్వామి వారిని దర్శించుకున్నారు.

అనంతరం వేద పండితులు ఆశీర్వచనాలు అందించి, తీర్థ ప్రసాదాలు, స్వామివారి చిత్రపటాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఐ.ఎస్. జగన్నాథపురం శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారి ఆలయ స్థల పురాణం పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తో పాటు శాసన సభలో ప్రభుత్వ విప్ లు బొలిశెట్టి శ్రీనివాస్, బొమ్మడి నాయకర్, ఎమ్మెల్యేలు మద్దిపాటి వెంకట రాజు, చిర్రి బాలరాజు, బడేటి రాధాకృష్ణ, పత్సమట్ల ధర్మరాజు, పులపర్తి రామాంజనేయులు, జనసేన జిల్లా అధ్యక్షులు కొటికలపూడి గోవిందరావు, డీసీఎంఎస్ ఛైర్మన్ చాగంటి మురళీ కృష్ణ, ఆర్టీసీ జోనల్ ఛైర్మన్ రెడ్డి అప్పల నాయుడు, జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి, ఎస్పీ కె. ప్రతాప్ శివ కిషోర్ తదితరులు స్వామి వారిని దర్శించుకున్న వారిలో ఉన్నారు.