తెలంగాణ కేబినెట్ కీల‌క తీర్మాణాలు

సీఎం అధ్య‌క్ష‌త‌న మంత్రివ‌ర్గం స‌మావేశం

హైద‌రాబాద్ : సీఎం ఎ. రేవంత్ రెడ్డి అధ్య‌క్ష‌త‌న కీల‌క సమావేశం జ‌రిగింది. ప‌లు ముఖ్య‌మైన అంశాల‌పై చ‌ర్చించారు. ప‌లు తీర్మానాల‌కు ఆమోదం తెలిపింది మంత్రివ‌ర్గం. 5 ఏళ్ల కాలపరిమితి ఒప్పందాలతో 3 వేల మెగావాట్ల సోలార్ పవర్ కొనుగోలుకు వీలైనంత తొందరగా టెండర్లు పిలవాలని స్పష్టం చేశారు సీఎం. సోలార్ పవర్ తరహాలోనే పంప్డ్ స్టోరేజ్ పవర్ వినియోగం పెంచడానికి 5 ఏళ్ల కాలపరిమితి ఒప్పందాలతో 2 వేల మెగావాట్ల పంప్డ్ స్టోరేజీ పవర్ కొనుగోలుకు టెండర్లు పిలిచేందుకు తీర్మానం చేశారు. పంప్డ్ స్టోరేజీ పవర్ ప్లాంట్లను నెలకొల్పేందుకు ముందుకు వచ్చే కంపెనీలు, పెట్టుబడిదారులకు అనుమతి ఇచ్చేందుకు ఆమోదం తెలిపింది కేబినెట్. ఇప్పటికే డిస్కమ్‌ల వద్ద ఉన్న ఎంఓయూలను కూడా పరిశీలించాలని నిర్ణయించింది.

రాష్ట్రంలో 10 వేల మెగావాట్ల పంప్డ్ స్టోరేజ్ విద్యుత్తు ఉత్పత్తి ప్లాంట్లను ఏర్పాటుకు అనుమతులు ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. అందుకు ఆసక్తిని వ్యక్తీకరించే కంపెనీలకు అవసరమైన భూమి, నీటిని ప్రభుత్వం కేటాయిస్తుంది. ఈ ప్లాంట్లలో ఉత్పత్తి చేసే విద్యుత్‌ను ముందుగా రాష్ట్ర డిస్కమ్‌లకే అమ్మాలనే షరతుతో ప్రభుత్వం ఒప్పందం చేసుకుంటుంది.రాష్ట్రానికి వచ్చే కొత్త పరిశ్రమలు, పెట్టుబడులను ఆకర్షించేందుకు క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ పాలసీ లో కొత్త పరిశ్రమలకు అవసరమైన విద్యుత్తును సొంతంగా ఉత్పత్తి చేసుకునేందుకు అవకాశం కల్పించడం ముఖ్య ఉద్దేశ‌మ‌ని స్ప‌ష్టం చేసింది కేబినెట్.

కొత్త పరిశ్రమలు క్యాప్టివ్ పవర్ జనరేషన్‌కు దరఖాస్తు చేసుకుంటే వెంటనే అనుమతి ఇవ్వాలి. ఇందులో విద్యుత్తు ఉత్పత్తి సామర్థ్యానికి సంబంధిత ఎలాంటి గరిష్ఠ పరిమితి లేదని పేర్కొంది. రామగుండం థర్మల్ పవర్ స్టేషన్‌లో కొత్తగా నిర్మించే 800 మెగావాట్ల ప్లాంట్‌ను ఎన్టీపీసీ అధ్వర్యంలో చేపట్టాలి. పాల్వంచ, మక్తల్‌లోనూ ఎన్టీపీసీ అధ్వర్యంలో విద్యుత్తు ప్లాంట్ల నిర్మాణానికి ఉన్న అవకాశాలను పరిశీలించాల‌ని కేబినెట్ నిర్ణ‌యించింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్ముగూడెం మండలం పెద్ద నల్లబెల్లి గ్రామంలో ఎస్సీ, ఎస్టీ బీసీ యంగ్ ఇండియా ఇంటిగ్రేటేడ్ రెసిడెన్షియల్ స్కూల్ నిర్మాణానికి 20.28 ఎకరాల ప్రభుత్వ స్థలం కేటాయించింది.

  • Related Posts

    రాబోయే భ‌విష్య‌త్తును నిర్దేశించేది ఏఐనే

    చెన్నై : : ‘దేశమే ప్రథమం’ అనే సూత్రానికి కట్టుబడి, తమ జ్ఞానం, ఆవిష్కరణలు , నైపుణ్యాలను దేశ నిర్మాణానికి వినియోగించాలని ఉప రాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్ పట్టభద్రులను కోరారు. చెన్నై సమీపంలోని కట్టంకుళత్తూరులో ఉన్న ఎస్.ఆర్.ఎం. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్…

    తెలంగాణ ‘సేఫ్’ డైర‌క్ట‌ర్ గా అవినాష్ మొహంతి

    హైద‌రాబాద్ : తెలంగాణ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఇప్ప‌టికే స‌మ‌ర్థ‌వంత‌మైన పోలీస్ ఆఫీస‌ర్ గా గుర్తింపు పొందారు అవినాష్ మొహంతి. ఆయ‌న‌కు కీల‌క ప‌ద‌వి క‌ట్ట‌బెట్టింది . సేఫ్ డైరెక్ట‌ర్ గా నియ‌మించింది. గతంలో తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *