విద్య‌, వైద్యం మాత్ర‌మే ఉచితంగా ఇవ్వాలి

స్ప‌ష్టం చేసిన మాజీ ఉప రాష్ట్ర‌ప‌తి వెంక‌య్య‌

అమ‌రావ‌తి : మాజీ ఉప రాష్ట్ర‌ప‌తి ముప్ప‌వ‌ర‌పు వెంక‌య్య నాయుడు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఉచిత ప‌థ‌కాల వ‌ల్ల ఒరిగేది ఏమీ ఉండ‌ద‌న్నారు. స‌మాజంలో మ‌రింత అంత‌రాలు పెరిగే అవ‌కాశం ఉంద‌న్నారు. ప్ర‌తిదీ ఉచితంగా అల‌వాటు చేస్తూ పోతే చివ‌ర‌కు ప‌ని చేసే వారంటూ ఎవ‌రూ ఉండ‌ర‌ని అభిప్రాయ ప‌డ్డారు. అది రాష్ట్రానికి, దేశానికి, ముఖ్యంగా స‌మాజానికి మంచిది కాద‌ని పేర్కొన్నారు మాజీ ఉప రాష్ట్ర‌ప‌తి. ఏ ప్ర‌భుత్వ‌మైనా స‌రే ఏవీ ఎవరికీ ఉచితంగా ఇవ్వకూడదని స్ప‌ష్టం చేశారు. విద్య‌, వైద్య రంగాలు ప్ర‌ధానంగా ప్ర‌జ‌ల‌కు అందుబాటులో ఉండాల‌ని అన్నారు. మ‌హిళ‌లు ఉచితంగా త‌మ‌కు బ‌స్సు సౌక‌ర్యం క‌ల్పించాల‌ని ఏపీ, తెలంగాణ రాష్ట్ర ప్ర‌భుత్వాల‌ను అడిగారా అని ప్ర‌శ్నించారు.

విద్య వ‌ల్ల వికాసం అల‌వ‌డుతుంద‌న్నారు ముప్ప‌వ‌ర‌పు వెంక‌య్య నాయుడు. రోజు రోజుకు విద్య‌, వైద్య రంగాలు పూర్తిగా ప్రైవేట్, కార్పొరేట్ శ‌క్తుల చేతుల్లోకి వెళ్లి పోయాయ‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు మాజీ ఉప రాష్ట్ర‌ప‌తి. విలువ‌లే ప్రాతిప‌దిక‌గా ప్ర‌జా ప్ర‌తినిధులు ప్ర‌జ‌ల‌కు సేవ‌లు అందించ‌ల‌ని, వారికి ఎల్ల‌వేళ‌లా అందుబాటులో ఉండాల‌ని స్ప‌ష్టం చేశారు. విద్య‌తోనే ఉపాధి ల‌భించ‌డంతో పాటు స‌మాజంలో అత్యున్న‌త గౌర‌వం ల‌భించేలా చేస్తుంద‌ని , అందుకే ప్ర‌తి ఒక్క‌రు చ‌దువుపై దృష్టి పెట్టాల‌ని అన్నారు ముప్ప‌వ‌ర‌పు వెంక‌య్య నాయుడు.

  • Related Posts

    రాబోయే భ‌విష్య‌త్తును నిర్దేశించేది ఏఐనే

    చెన్నై : : ‘దేశమే ప్రథమం’ అనే సూత్రానికి కట్టుబడి, తమ జ్ఞానం, ఆవిష్కరణలు , నైపుణ్యాలను దేశ నిర్మాణానికి వినియోగించాలని ఉప రాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్ పట్టభద్రులను కోరారు. చెన్నై సమీపంలోని కట్టంకుళత్తూరులో ఉన్న ఎస్.ఆర్.ఎం. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్…

    తెలంగాణ ‘సేఫ్’ డైర‌క్ట‌ర్ గా అవినాష్ మొహంతి

    హైద‌రాబాద్ : తెలంగాణ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఇప్ప‌టికే స‌మ‌ర్థ‌వంత‌మైన పోలీస్ ఆఫీస‌ర్ గా గుర్తింపు పొందారు అవినాష్ మొహంతి. ఆయ‌న‌కు కీల‌క ప‌ద‌వి క‌ట్ట‌బెట్టింది . సేఫ్ డైరెక్ట‌ర్ గా నియ‌మించింది. గతంలో తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *