స‌క్కుబాయి లేఔట్‌లో ఆక్ర‌మ‌ణ‌ల‌పై హైడ్రా విచార‌ణ‌

సంబంధిత ప‌త్రాల‌ను స‌మ‌ర్పించాలన్న హైడ్రా క‌మిష‌న‌ర్‌
హైద‌రాబాద్ : జూబ్లీహిల్స్ నియోజ‌క‌వ‌ర్గం లోని షేక్‌పేట విలేజ్‌లోని స‌క్కుబాయి లే ఔట్‌లో ప్ర‌జావ‌స‌రాల‌కు ఉద్దేశించిన స్థ‌లాల ఆక్ర‌మ‌ణ‌ల‌పై హైడ్రా విచార‌ణ చేప‌ట్టింది. స‌ర్వేనంబ‌రు 327లో 25 ఎక‌రాల ప‌రిధిలో స‌క్కుబాయి న‌గ‌ర్ మ్యూచ్చ్యువ‌ల్లీ ఎయిడెడ్ కోప‌రేటివ్ సొసైటీ పేరుతో లే ఔట్ వేశారు. ఇక్క‌డ పార్కును కాపాడాలంటూ హైడ్రా ప్ర‌జావాణిలో వ‌చ్చిన ఫిర్యాదు మేర‌కు క్షేత్ర స్థాయిలో విచారించిన హైడ్రా అధికారుల‌కు మ‌రిన్ని ఆక్ర‌మ‌ణ‌ల గురించి తెలిసింది. పార్కుతో పాటు.. శ్మ‌శాన వాటిక‌, చారిత్ర‌క బుల్కాపూర్ నాలా ఆక్ర‌మ‌ణ‌ల‌కు గురైన‌ట్టు గుర్తించారు. దీంతో స‌ర్వే నంబ‌రు 327లో మిగిలి ఉన్న భూమికి సంబంధించిన అంశాల‌పై పూర్తి స్థాయి విచార‌ణ చేప‌ట్టాల‌ని హైడ్రా క‌మిష‌న‌ర్ ఏవీ రంగ‌నాథ్ భావించారు. ఇక్క‌డి ఖాళీ స్థ‌లాల‌పై సొసైటీకి చెందిన వారితో పాటు, షేక్‌పేట విలేజ్ ప్ర‌తినిధులతో హైడ్రా కార్యాల‌యంలో హైడ్రా క‌మిష‌న‌ర్ స‌మావేశ‌మ‌య్యారు.

ఇరు ప‌క్షాల వాద‌న‌లు విన్నారు. సంబంధిత ప‌త్రాల‌ను ప‌రిశీలించారు. స‌క్కుబాయి లే ఔట్ వేసిన భూమి ప్ర‌భుత్వానిద‌ని షేక్ పేట విలేజ్ ప్ర‌తినిధులు స‌దానందం, అశోక్ కుమార్ ఆరోపించారు. పార్కు స్థ‌లంగా పేర్కొంటున్న ప్రాంతాన్ని తాము ఆల‌య ఉత్స‌వాల‌కు వాడుకుంటున్నామ‌ని క‌మిష‌న‌ర్‌కు వివ‌రించారు. శ్మ‌శానాన్ని కూడా వ‌ద‌ల‌కుండా సొసైటీ ప్ర‌తినిధులు క‌బ్జాల‌కు పాల్ప‌డ్డార‌ని ఆరోపించారు. సొసైటీ ప్ర‌తినిధులు కూడా ఆ భూమి త‌మ‌కు ఎలా వ‌చ్చిందో సొసైటీ సెక్ర‌ట‌రీ సీతారామ‌య్య వివ‌రించారు. అధికారిక లే ఔట్‌లోని పార్కును కాపాడాల‌ని కోరారు. ఈ నేప‌థ్యంలో క్షేత్ర‌స్థాయిలో మ‌రింత లోతైన విచార‌ణ చేప‌ట్టాల‌ని హైడ్రా క‌మిష‌న‌ర్ ఏవీ రంగ‌నాథ్ ఆదేశించారు. స‌బంధిత ప‌త్రాల‌న్నీ ప‌రిశీలించి.. క్షేత్ర స్థాయిలో వివిధ శాఖ‌ల అధికారుల నుంచి పూర్తి వివ‌రాలు తెలుసు కోవాల‌ని హైడ్రా అదికారుల‌కు సూచించారు. ఇరు ప‌క్షాల‌కు చెందిన వారు కూడా పూర్తి వివ‌రాలు అంద‌జేయాల‌ని.. త‌ర్వాత అన్ని శాఖ‌ల అధికారుల స‌మ‌క్షంలో స‌మావేశాన్ని ఏర్పాటు చేస్తామ‌ని క‌మిష‌న‌ర్ హామీ ఇచ్చారు.

  • Related Posts

    రాబోయే భ‌విష్య‌త్తును నిర్దేశించేది ఏఐనే

    చెన్నై : : ‘దేశమే ప్రథమం’ అనే సూత్రానికి కట్టుబడి, తమ జ్ఞానం, ఆవిష్కరణలు , నైపుణ్యాలను దేశ నిర్మాణానికి వినియోగించాలని ఉప రాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్ పట్టభద్రులను కోరారు. చెన్నై సమీపంలోని కట్టంకుళత్తూరులో ఉన్న ఎస్.ఆర్.ఎం. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్…

    తెలంగాణ ‘సేఫ్’ డైర‌క్ట‌ర్ గా అవినాష్ మొహంతి

    హైద‌రాబాద్ : తెలంగాణ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఇప్ప‌టికే స‌మ‌ర్థ‌వంత‌మైన పోలీస్ ఆఫీస‌ర్ గా గుర్తింపు పొందారు అవినాష్ మొహంతి. ఆయ‌న‌కు కీల‌క ప‌ద‌వి క‌ట్ట‌బెట్టింది . సేఫ్ డైరెక్ట‌ర్ గా నియ‌మించింది. గతంలో తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *