ఉచితంగా బీసీలకు సివిల్స్ లో శిక్ష‌ణ

ప్ర‌క‌టించిన మంత్రి ఎస్. స‌విత

అమ‌రావ‌తి : ఏపీ కూటమి ప్ర‌భుత్వం తీపి క‌బురు చెప్పింది. బ‌హుజ‌న విద్యార్థుల‌కు మేలు చేకూర్చేలా కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఇందుకు సంబంధించి కీల‌క వ్యాఖ్య‌లు చేశారు రాష్ట్ర బీసీ సంక్షేమ , జౌళి శాఖ మంత్రి ఎస్. స‌విత‌. విజ‌య‌వాడ లోని బీసీ కార్యాల‌యంలో ఉన్న‌తాధికారుల‌తో స‌మీక్ష చేప‌ట్టారు. ఈ సంద‌ర్భంగా కీల‌క సూచ‌న‌లు చేశారు. బీసీ విద్యార్థులు, అభ్య‌ర్థుల కోసం ప్ర‌త్యేకంగా ఉచితంగా ఇంటిగ్రేటెడ్ సివిల్స్ లో శిక్ష‌ణ ఇస్తున్న‌ట్లు చెప్పారు. అంతే కాకుండా మ‌హిళ‌లు, పురుషుల‌కు వేర్వేరుగా ఉచితంగా భోజ‌న‌, వ‌స‌తి సౌక‌ర్యం క‌ల్పిస్తున్న‌ట్లు తెలిపారు. సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు ఆదేశాల మేర‌కు ఈ నిర్ణ‌యం తీసుకున్నామ‌ని స్ప‌ష్టం చేశారు.

ఇదిలా ఉండ‌గా మంత్రి కీల‌క సూచ‌న చేశారు. బీసీ స్టడీ సర్కిల్ ద్వారా అందించే ఉచిత సివిల్ సర్వీసెస్ ఇంటిగ్రేటెడ్ శిక్షణకు బీసీ అభ్యర్థులతో పాటు ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకూ అవకాశమిస్తున్నట్లు మంత్రి సవిత వెల్లడించారు. 100 సీట్లలో బీసీలకు 66 సీట్లు, ఎస్సీలకు 20, ఎస్టీలకు 14 సీట్లు కేటాయిస్తున్నామని వెల్ల‌డించారు. మహిళలకు 34 శాతం రిజర్వేషన్లు అమలు చేయనున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ కార్యదర్శి ఎస్.సత్యనారాయణ, అడిషనల్ డైరెక్టర్ రామచంద్ర రాజు, ఇతర అధికారులు పాల్గొన్నారు.

  • Related Posts

    రాబోయే భ‌విష్య‌త్తును నిర్దేశించేది ఏఐనే

    చెన్నై : : ‘దేశమే ప్రథమం’ అనే సూత్రానికి కట్టుబడి, తమ జ్ఞానం, ఆవిష్కరణలు , నైపుణ్యాలను దేశ నిర్మాణానికి వినియోగించాలని ఉప రాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్ పట్టభద్రులను కోరారు. చెన్నై సమీపంలోని కట్టంకుళత్తూరులో ఉన్న ఎస్.ఆర్.ఎం. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్…

    తెలంగాణ ‘సేఫ్’ డైర‌క్ట‌ర్ గా అవినాష్ మొహంతి

    హైద‌రాబాద్ : తెలంగాణ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఇప్ప‌టికే స‌మ‌ర్థ‌వంత‌మైన పోలీస్ ఆఫీస‌ర్ గా గుర్తింపు పొందారు అవినాష్ మొహంతి. ఆయ‌న‌కు కీల‌క ప‌ద‌వి క‌ట్ట‌బెట్టింది . సేఫ్ డైరెక్ట‌ర్ గా నియ‌మించింది. గతంలో తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *