జిల్లాల క‌లెక్ట‌ర్లు అప్ర‌మ‌త్తంగా ఉండాలి

ఆదేశించిన హోం మంత్రి అనిత వంగ‌ల‌పూడి

అమ‌రావ‌తి : నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన దిత్వా తుఫాన్‌ నేపథ్యంలో విపత్తు నిర్వహణ శాఖ అధికారులతో శ‌నివారం సమీక్ష నిర్వహించారు రాష్ట్ర హోం, విప‌త్తుల నిర్వ‌హ‌ణ శాఖ మంత్రి వంగ‌ల‌పూడి అనిత‌. ప్రభావిత జిల్లాల్లో ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని స్ప‌ష్టం చేశారు. NDRF, SDRF బలగాలను సిద్ధంగా ఉంచాలని ఆదేశించారు మంత్రి. క్షేత్రస్థాయిలో అధికార యంత్రాంగం అనుక్షణం అలర్ట్‌గా ఉండాలని సూచించారు. భారీ వర్షాలు కురిసే అవకాశాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రజలు వీలైనంత వరకు ఇంట్లోనే సురక్షితంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు.

అంతే కాకుండా ప్ర‌జ‌ల బాగు కోసం అత్యవసర సహాయక చర్యలకు గాను టోల్‌ ఫ్రీ నంబర్లు 112, 1070, 1800-425-0101లో సంప్రదించాలని సూచించారు మంత్రి వంగ‌ల‌పూడి అనిత‌. అత్యంత అవ‌స‌ర‌మైతే త‌ప్పా ప్ర‌జ‌లు, రైతులు బ‌య‌ట‌కు రావ‌ద్ద‌ని కోరారు. అంతే కాకుండా స‌ముద్రంలో చేప‌ల వేట‌కు వెళ్లే మ‌త్స్య‌కారులు అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని హెచ్చ‌రించారు. ఎలాంటి విప‌త్తుల‌నైనా ఎదుర్కొనేందుకు కూట‌మి స‌ర్కార్ సిద్ద‌మై ఉంద‌ని స్ప‌ష్టం చేశారు మంత్రి. ఈ స‌మావేశంలో విప‌త్తుల నిర్వ‌హ‌ణ సంస్థ మేనేజింగ్ డైరెక్ట‌ర్ ప్ర‌ఖ‌ర్ జైన్ పాల్గొన్నారు.

  • Related Posts

    రాబోయే భ‌విష్య‌త్తును నిర్దేశించేది ఏఐనే

    చెన్నై : : ‘దేశమే ప్రథమం’ అనే సూత్రానికి కట్టుబడి, తమ జ్ఞానం, ఆవిష్కరణలు , నైపుణ్యాలను దేశ నిర్మాణానికి వినియోగించాలని ఉప రాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్ పట్టభద్రులను కోరారు. చెన్నై సమీపంలోని కట్టంకుళత్తూరులో ఉన్న ఎస్.ఆర్.ఎం. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్…

    తెలంగాణ ‘సేఫ్’ డైర‌క్ట‌ర్ గా అవినాష్ మొహంతి

    హైద‌రాబాద్ : తెలంగాణ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఇప్ప‌టికే స‌మ‌ర్థ‌వంత‌మైన పోలీస్ ఆఫీస‌ర్ గా గుర్తింపు పొందారు అవినాష్ మొహంతి. ఆయ‌న‌కు కీల‌క ప‌ద‌వి క‌ట్ట‌బెట్టింది . సేఫ్ డైరెక్ట‌ర్ గా నియ‌మించింది. గతంలో తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *