ప‌వ‌న్ ఆస్తులు అమ్ముకో విజ‌య‌వాడ వెళ్లిపో

నీకు ఎందుకు తెలంగాణ పై ఆక్ర‌శం

పాల‌మూరు జిల్లా : ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్ పై నిప్పులు చెరిగారు జ‌డ్చ‌ర్ల ఎమ్మెల్యే జ‌నంప‌ల్లి అనిరుధ్ రెడ్డి. తెలంగాణ‌పై నోరు పారేసుకుంటే బాగుండ‌ద‌ని హెచ్చ‌రించారు. పవన్ కల్యాణ్ నువ్వు 70 ఏళ్లు అయినా సీఎం కాలేవు అన్నారు. తక్ష‌ణ‌మే తెలంగాణలో ఉన్న ఆస్తులు అమ్మేసుకొని విజయవాడ వెళ్ళిపో అని మండిప‌డ్డారు. నిన్ను ప్యాకేజ్ స్టార్ అని అంద‌రూ అంటారని, దమ్ముంటే టీడీపీని వదిలి ఒంటరిగా పోటీ చెయ్యాలంటూ స‌వాల్ విసిరారు. OG మూవీ ఫ్లాప్ అయినా రూ.800 పెట్టి నేను సినిమా చూశాన‌ని చెప్పారు అనిరుధ్ రెడ్డి. పవన్ కళ్యాణ్‌పై తీవ్ర స్థాయిలో మండిప‌డ్డారు.

తెలంగాణ వాళ్ళ నర దిష్టి తగిలినందుకే కోనసీమ జిల్లాలోని కొబ్బరి చెట్లు మొండెం లేకుండా అయ్యాయని పవన్ కళ్యాణ్ మాట్లాడ‌టంపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు ఎమ్మెల్యే. పవన్ కళ్యాణ్ ఆంధ్రాకి డిప్యూటీ సీఎం.. ఉండేది, బిజినెస్ చేసుకునేది తెలంగాణలో అని ఆరోపించారు. నిజంగా తెలంగాణ వాళ్ళకి నర దిష్టి, ఒకరు బాగు పడొద్దు అనేది ఉంటే ఆంధ్రా వాళ్ళు ఇక్కడ బిజినెస్ చేసుకుంటారా? అని ప్ర‌శ్నించారు. ఇరిగేషన్, కన్‌స్ట్రక్షన్‌ అన్నిట్లో ఆంధ్రా వాళ్ళు ఉన్నారు అయినా ఒక్క మాట మేము అంటున్నామా అని అన్నారు. తాను కూడా పవన్ కళ్యాణ్ అభిమానినే కానీ తప్పు మాట్లాడాడు కాబట్టి నిల‌దీస్తున్నాన‌ని చెప్పారు. ప‌వ‌న్ క‌ళ్యాణ్ త‌క్ష‌ణమే తెలంగాణ ప్ర‌జ‌ల‌కు క్ష‌మాప‌ణ చెప్పాల‌ని డిమాండ్ చేశారు అనిరుధ్ రెడ్డి.

  • Related Posts

    రాబోయే భ‌విష్య‌త్తును నిర్దేశించేది ఏఐనే

    చెన్నై : : ‘దేశమే ప్రథమం’ అనే సూత్రానికి కట్టుబడి, తమ జ్ఞానం, ఆవిష్కరణలు , నైపుణ్యాలను దేశ నిర్మాణానికి వినియోగించాలని ఉప రాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్ పట్టభద్రులను కోరారు. చెన్నై సమీపంలోని కట్టంకుళత్తూరులో ఉన్న ఎస్.ఆర్.ఎం. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్…

    తెలంగాణ ‘సేఫ్’ డైర‌క్ట‌ర్ గా అవినాష్ మొహంతి

    హైద‌రాబాద్ : తెలంగాణ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఇప్ప‌టికే స‌మ‌ర్థ‌వంత‌మైన పోలీస్ ఆఫీస‌ర్ గా గుర్తింపు పొందారు అవినాష్ మొహంతి. ఆయ‌న‌కు కీల‌క ప‌ద‌వి క‌ట్ట‌బెట్టింది . సేఫ్ డైరెక్ట‌ర్ గా నియ‌మించింది. గతంలో తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *