దేశం గ‌ర్వించ ద‌గిన నాయ‌కుడు వాజ్‌పేయి

ప్ర‌శంసించిన బీజేపీ అధ్య‌క్షుడు పీవీఎన్ మాధ‌వ్

అమ‌రావ‌తి : భార‌త దేశం గ‌ర్వించ ద‌గిన మహోన్న‌త మాన‌వుడు దివంగ‌త ప్ర‌ధాన‌మంత్రి అట‌ల్ బిహారీ వాజ్ పేయి అని అన్నారు ఏపీ భార‌తీయ జ‌న‌తా పార్టీ అధ్య‌క్షుడు పీవీఎన్ మాధ‌వ్. ఆదివారం కోనసీమ జిల్లా మండపేట నియోజకవర్గంలోని మండపేటలో భారత రత్న, మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్‌పేయి విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నారు. దేశాన్ని అభివృద్ధి దిశగా నడిపించిన దూరదృష్టి, ప్రజాస్వామ్య విలువల పట్ల అచంచల నిబద్ధత, మాటలో మాధుర్యంం , వాజ్‌పేయిని గొప్ప నాయ‌కుడిగా నిల‌బెట్టేలా చేశాయ‌న్నారు.

ఆయన సేవా తపస్సును స్మరించుకుంటూ ఆయన ఆశయాలకు అనుగుణంగా పని చేయాలన్న సంకల్పం పునరుద్ఘాటించామ‌ని అన్నారు పీవీఎన్ మాధ‌వ్. ఆయ‌న అందించిన సేవ‌లు ఎప్ప‌టికీ , ఎల్ల‌ప్ప‌టికీ నిలిచే ఉంటాయ‌న్నారు. ఈ దేశంలో కీల‌క‌మైన ర‌హ‌దారుల నిర్మాణానికి శ్రీ‌కారం చుట్టింది త‌న హ‌యాంలోనేన‌ని గుర్తు చేశారు పీవీఎన్ మాధ‌వ్. ఈ కార్య‌క్ర‌మంలో రాజ‌మండ్రి ఎంపీ పురందేశ్వ‌రి, ఎమ్మెల్యే న‌ల్ల‌మ‌ల్లి రామ‌కృష్ణా రెడ్డి, ఎమ్మెల్సీ సోము వీర్రాజు, జిల్లా అధ్యక్షులు అడబాల సత్యనారాయణ తో పాటు బిజెపి నాయకులు పాల్గొన్నారు.

  • Related Posts

    రాబోయే భ‌విష్య‌త్తును నిర్దేశించేది ఏఐనే

    చెన్నై : : ‘దేశమే ప్రథమం’ అనే సూత్రానికి కట్టుబడి, తమ జ్ఞానం, ఆవిష్కరణలు , నైపుణ్యాలను దేశ నిర్మాణానికి వినియోగించాలని ఉప రాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్ పట్టభద్రులను కోరారు. చెన్నై సమీపంలోని కట్టంకుళత్తూరులో ఉన్న ఎస్.ఆర్.ఎం. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్…

    తెలంగాణ ‘సేఫ్’ డైర‌క్ట‌ర్ గా అవినాష్ మొహంతి

    హైద‌రాబాద్ : తెలంగాణ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఇప్ప‌టికే స‌మ‌ర్థ‌వంత‌మైన పోలీస్ ఆఫీస‌ర్ గా గుర్తింపు పొందారు అవినాష్ మొహంతి. ఆయ‌న‌కు కీల‌క ప‌ద‌వి క‌ట్ట‌బెట్టింది . సేఫ్ డైరెక్ట‌ర్ గా నియ‌మించింది. గతంలో తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *