విభిన్న ప్ర‌తిభావంతుల‌ను ఆదుకుంటాం

స్ప‌ష్టం చేసిన సీఎం చంద్ర‌బాబు నాయుడు

అమ‌రావ‌తి : విభిన్న ప్ర‌తిభావంతుల‌కు పూర్తి భ‌రోసా ఇచ్చే ప్ర‌య‌త్నం చేశారు ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు. మంగళగిరి పార్టీ కేంద్ర కార్యాలయంలో ప్ర‌జా ద‌ర్బార్ చేప‌ట్టారు. ఈ సంద‌ర్బంగా త‌న‌కు విన‌త‌లు ఇచ్చేందుకు పెద్ద ఎత్తున త‌ర‌లి వ‌చ్చారు దివ్యాంగులు. అంద‌రినీ ఆశ్చ‌ర్య పోయేలా చేశారు ముఖ్య‌మంత్రి. తానే వారి వ‌ద్ద‌కు వెళ్లారు. వారి బాగోగుల గురించి ఆరా తీశారు. రాష్ట్రంలో గ‌తంలో ఏలిన జ‌గ‌న్ రెడ్డి స‌ర్కార్ వికలాంగుల సంక్షేమం కోసం పాటు ప‌డ‌లేద‌ని ఆరోపించారు. కానీ కూట‌మి స‌ర్కార్ వ‌చ్చాక సీన్ మారింద‌న్నారు. ప్ర‌తి ఒక్క‌రికీ ఆస‌రా క‌ల్పించేలా చ‌ర్య‌లు తీసుకోవ‌డం జ‌రిగింద‌ని చెప్పారు ఏపీ సీఎం.

ఎవ‌రూ కూడా మీరు వికలాంగుల‌మ‌ని బాధ ప‌డ‌వ‌ద్ద‌ని సూచించారు నారా చంద్ర‌బాబు నాయుడు. మీ వెంట ప్ర‌భుత్వం ఉంద‌ని మ‌రిచి పోవ‌ద్ద‌న్నారు. ప్ర‌తి ఒక్క‌రూ త‌మ కాళ్ల మీద నిల‌బ‌డేలా చ‌ర్య‌లు తీసుకుంటామ‌న్నారు. ఇప్ప‌టికే ఠంఛ‌న్ గా ఒక‌టో తేదీనే పెన్ష‌న్ ఇస్తున్నామ‌ని చెప్పారు. రాష్ట్ర ఖ‌జానా దివాలా అంచున ఉన్న‌ప్ప‌టికీ ఏ ఒక్క‌రినీ ఇబ్బంది పెట్ట‌డం లేద‌న్నారు. ప్ర‌స్తుతం రాష్ట్రం గాడిన ప‌డింద‌ని చెప్పారు సీఎం. ప్ర‌స్తుతం పాడై పోయిన‌, ప‌క్క‌దారి పట్టిన అన్ని వ్య‌వ‌స్థ‌ల‌ను బ‌లోపేతం చేసే ప‌నిలో ప‌డ్డామ‌న్నారు. అందులో దివ్యాంగుల సంక్షేమం కోసం కృషి చేస్తున్న‌ట్లు చెప్పారు చంద్ర‌బాబు నాయుడు.

  • Related Posts

    రాబోయే భ‌విష్య‌త్తును నిర్దేశించేది ఏఐనే

    చెన్నై : : ‘దేశమే ప్రథమం’ అనే సూత్రానికి కట్టుబడి, తమ జ్ఞానం, ఆవిష్కరణలు , నైపుణ్యాలను దేశ నిర్మాణానికి వినియోగించాలని ఉప రాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్ పట్టభద్రులను కోరారు. చెన్నై సమీపంలోని కట్టంకుళత్తూరులో ఉన్న ఎస్.ఆర్.ఎం. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్…

    తెలంగాణ ‘సేఫ్’ డైర‌క్ట‌ర్ గా అవినాష్ మొహంతి

    హైద‌రాబాద్ : తెలంగాణ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఇప్ప‌టికే స‌మ‌ర్థ‌వంత‌మైన పోలీస్ ఆఫీస‌ర్ గా గుర్తింపు పొందారు అవినాష్ మొహంతి. ఆయ‌న‌కు కీల‌క ప‌ద‌వి క‌ట్ట‌బెట్టింది . సేఫ్ డైరెక్ట‌ర్ గా నియ‌మించింది. గతంలో తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *