సిరిసిల్ల జిల్లా అధ్య‌క్షుడిగా సంగీతం శ్రీ‌నివాస్

ప్ర‌మాణ స్వీకారం చేయించిన మంత్రి పొన్నం

రాజ‌న్న సిరిసిల్ల జిల్లా : రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ జోరు కొన‌సాగుతోంద‌న్నారు రాష్ట్ర ర‌వాణా శాఖ మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్ గౌడ్. ఆదివారం రాజన్న సిరిసిల్ల జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా సంగీతం శ్రీనివాస్ బాధ్యతలు చేప‌ట్టారు. ఈ సంద‌ర్బంగా ముఖ్య అతిథిగా హాజ‌ర‌య్యారు మంత్రి పొన్నంతో పాటు సీనియ‌ర్ నాయ‌కుడు వి. హ‌నుమంత రావు, ప్ర‌భుత్వ విప్ ఆది శ్రీ‌నివాస్ , ఇత‌ర కీల‌క నేత‌లు పాల్గొన్నారు.
అంత‌కు ముందు ప‌ట్ట‌ణంలో అమర వీరుల స్థూపానికి నివాళులు అర్పించారు. బస్ స్టేషన్ నుండి కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వరకు భారీగా ర్యాలీ చేప‌ట్టారు.

సంగీత శ్రీనివాస్ చేత జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులుగా ప్రమాణ స్వీకారం చేయించడం త‌న‌కు ఆనందంగా ఉంద‌న్నారు ఈ సంద‌ర్బంగా మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్ గౌడ్. శ్రీ‌నివాస్ ను సత్క‌రించారు. ఈ కార్య‌క్ర‌మంలో
మాజీ ఎమ్మెల్యే మృత్యుంజయ , జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నాగుల సత్యనారాయణ గౌడ్ , సిరిసిల్ల మార్కెట్ కమిటీ చైర్మన్ స్వరూప ,ఇతర ముఖ్య నేతలు పాల్గొన్నారు.

  • Related Posts

    రాబోయే భ‌విష్య‌త్తును నిర్దేశించేది ఏఐనే

    చెన్నై : : ‘దేశమే ప్రథమం’ అనే సూత్రానికి కట్టుబడి, తమ జ్ఞానం, ఆవిష్కరణలు , నైపుణ్యాలను దేశ నిర్మాణానికి వినియోగించాలని ఉప రాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్ పట్టభద్రులను కోరారు. చెన్నై సమీపంలోని కట్టంకుళత్తూరులో ఉన్న ఎస్.ఆర్.ఎం. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్…

    తెలంగాణ ‘సేఫ్’ డైర‌క్ట‌ర్ గా అవినాష్ మొహంతి

    హైద‌రాబాద్ : తెలంగాణ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఇప్ప‌టికే స‌మ‌ర్థ‌వంత‌మైన పోలీస్ ఆఫీస‌ర్ గా గుర్తింపు పొందారు అవినాష్ మొహంతి. ఆయ‌న‌కు కీల‌క ప‌ద‌వి క‌ట్ట‌బెట్టింది . సేఫ్ డైరెక్ట‌ర్ గా నియ‌మించింది. గతంలో తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *