అమరవీరుల కుటుంబాలకు సన్మానం

వారి వ‌ల్ల‌నే తెలంగాణ వ‌చ్చింద‌న్న హ‌రీశ్ రావు

సిద్దిపేట జిల్లా : అమ‌ర వీరుల బ‌లిదానం, ఆత్మ త్యాగం , కేసీఆర్ చేసిన పోరాటం వ‌ల్ల‌నే తెలంగాణ రాష్ట్రం సాధ్య‌మైంద‌న్నారు మాజీ మంత్రి త‌న్నీరు హ‌రీశ్ రావు. ఇదిలా ఉండ‌గా సిద్దిపేట జిల్లా కొండపాక మండలం దుద్దెడ గ్రామానికి చెందిన ముగ్గురు ఉద్యమ నాయకులు తెలంగాణ రావాలని, ఇక వస్తదో రాదో అనే ఆవేదన చెంది చని పోయార‌ని గుర్తు చేసుకున్నారు.

అవునూరు సత్తయ్య తెలంగాణ ఉద్యమ సమయంలో చనిపోయారు.. కేసీఆర్ ప్రభుత్వం వచ్చాక వారి కుమారుడు సందీప్ కు విద్యాశాఖ లో ఉద్యోగం కల్పించడం జరిగిందన్నారు హ‌రీశ్ రావు. అదే గ్రామానికి చెందిన శ్రీకాంత్ చనిపోగా అతని తమ్ముడు శ్రీదర్ కు వెటర్నరీ శాఖ లో ఉద్యోగం కల్పించామ‌న్నారు.
అదే విధంగా కన్నబోయిన ఐలయ్య ఉద్యమ సమయంలో తెలంగాణ కోసం పోరాడుతూ ఇక తెలంగాణ రాదు, ఈ కాంగ్రెస్ ఇవ్వదు అనే ఆవేదనతో చనిపోగా వారి కుటుంబంలో వారి కుమారునికి ఉద్యోగం కల్పించడం జరిగిందన్నారు హ‌రీశ్ రావు.

దీక్షా దివస్ సందర్బంగా వారి త్యాగలను కొనియాడుతూ వారిని స్మరిస్తూ వారి కుటుంబాలను మాజీ మంత్రి ఘ‌నంగా స‌న్మానించారు. వారి త్యాగాల‌ను కొనియాడారు. ఇలాంటి వాళ్లు చ‌ని పోలేద‌ని వారు ఇంకా సజీవంగా బ‌తికే ఉన్నార‌ని పేర్కొన్నారు హ‌రీశ్ రావు.

  • Related Posts

    రాబోయే భ‌విష్య‌త్తును నిర్దేశించేది ఏఐనే

    చెన్నై : : ‘దేశమే ప్రథమం’ అనే సూత్రానికి కట్టుబడి, తమ జ్ఞానం, ఆవిష్కరణలు , నైపుణ్యాలను దేశ నిర్మాణానికి వినియోగించాలని ఉప రాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్ పట్టభద్రులను కోరారు. చెన్నై సమీపంలోని కట్టంకుళత్తూరులో ఉన్న ఎస్.ఆర్.ఎం. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్…

    తెలంగాణ ‘సేఫ్’ డైర‌క్ట‌ర్ గా అవినాష్ మొహంతి

    హైద‌రాబాద్ : తెలంగాణ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఇప్ప‌టికే స‌మ‌ర్థ‌వంత‌మైన పోలీస్ ఆఫీస‌ర్ గా గుర్తింపు పొందారు అవినాష్ మొహంతి. ఆయ‌న‌కు కీల‌క ప‌ద‌వి క‌ట్ట‌బెట్టింది . సేఫ్ డైరెక్ట‌ర్ గా నియ‌మించింది. గతంలో తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *