దీక్షా దివ‌స్ ను దిగ్విజ‌యం చేయండి : కేటీఆర్
పార్టీ శ్రేణుల‌కు ప్రెసిడెంట్ దిశా నిర్దేశం

హైద‌రాబ‌ద్ : ఉద్య‌మ నాయ‌కుడు కేసీఆర్ దీక్ష చేప‌ట్టి విర‌మించిన రోజు డిసెంబ‌ర్ 9వ తేదీ. దీనిని ప్ర‌తి ఏటా దీక్షా దివ‌స్ ను నిర్వ‌హిస్తూ వ‌స్తోంది బీఆర్ఎస్. ఈ సంద‌ర్బంగా ఈసారి కూడా దీక్షా దివ‌స్ ను ఘ‌నంగా నిర్వ‌హించాల‌ని పిలుపునిచ్చారు పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. హైద‌రాబాద్ లోని పార్టీ కార్యాల‌యంలో టెలికాన్ఫ‌రెన్స్ నిర్వ‌హించారు. ఈ సంద‌ర్బంగా ఆనాడు నిర్వ‌హించే కార్య‌క్ర‌మాల‌ను వివ‌రించారు. నియోజకవర్గ కేంద్రాల్లోని తెలంగాణ తల్లి విగ్రహాలకు పాలాభిషేకం చేయాలని, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించాల‌ని సూచించారు.
ప్రభుత్వ ఆసుపత్రులలో రోగులకు పండ్లు పంపిణీ చేయాలని అన్నారు.

పార్టీ కార్యాలయాల వద్ద లేదా ప్రధాన కూడళ్లలో విజయానికి సూచికగా పింక్ బెలూన్లను గాలిలోకి ఎగుర వేయాల‌ని స్ప‌ష్టం చేశారు కేటీఆర్. కార్యక్రమం అనంతరం మీడియా సమావేశం ఏర్పాటు చేసి, కేసీఆర్ దీక్ష, తెలంగాణ పోరాటం, విద్యార్థుల త్యాగాలను ప్రజలకు, భవిష్యత్ తరాలకు గుర్తు చేయాలని అన్నారు. కేసీఆర్ గారి దీక్ష ఫలవంతమైన నిమ్స్ (NIMS) , గాంధీ ఆసుపత్రిలో తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో పండ్ల పంపిణీ కార్యక్రమాలు జరుగుతాయని తెలిపారు. నగర నాయకత్వం ఈ కార్యక్రమాల్లో పాల్గొనాలని సూచించారు.

  • Related Posts

    రాబోయే భ‌విష్య‌త్తును నిర్దేశించేది ఏఐనే

    చెన్నై : : ‘దేశమే ప్రథమం’ అనే సూత్రానికి కట్టుబడి, తమ జ్ఞానం, ఆవిష్కరణలు , నైపుణ్యాలను దేశ నిర్మాణానికి వినియోగించాలని ఉప రాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్ పట్టభద్రులను కోరారు. చెన్నై సమీపంలోని కట్టంకుళత్తూరులో ఉన్న ఎస్.ఆర్.ఎం. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్…

    తెలంగాణ ‘సేఫ్’ డైర‌క్ట‌ర్ గా అవినాష్ మొహంతి

    హైద‌రాబాద్ : తెలంగాణ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఇప్ప‌టికే స‌మ‌ర్థ‌వంత‌మైన పోలీస్ ఆఫీస‌ర్ గా గుర్తింపు పొందారు అవినాష్ మొహంతి. ఆయ‌న‌కు కీల‌క ప‌ద‌వి క‌ట్ట‌బెట్టింది . సేఫ్ డైరెక్ట‌ర్ గా నియ‌మించింది. గతంలో తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *