ఆరోగ్య సంర‌క్ష‌ణ ప్ర‌తి ఒక్క‌రికీ అవ‌స‌రం

కీల‌క వ్యాఖ్య‌లు చేసిన మంత్రి గొట్టిపాటి

గుంటూరు జిల్లా : ఆరోగ్య సంరక్షణపై ప్రతి ఒక్కరూ దృష్టి సారించాల్సిన అవసరం ఉన్నదని అన్నారు మంత్రి గొట్టిపాటి ర‌వికుమార్. రోజువారీ వ్యాయామం, నడక, మారథాన్ వంటి శారీరక విన్యాసాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని చెప్పారు. దేశ ప్రధాని నరేంద్ర మోదీ ఫిట్ ఇండియా పిలుపునకు అనుగుణంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స‌మ‌ర్త‌వంత‌మైన‌ నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం ప్రజారోగ్య పరిరక్షణ కోసం అనేక కార్యక్రమాలు చేపడుతోందని అన్నారు. ఈ నేపథ్యంలో తణుకు పట్టణంలోని చిట్టూరి ఇంద్రయ్య ప్రభుత్వ డిగ్రీ కళాశాల వద్ద తణుకు రన్నర్స్ సొసైటీ భాగస్వామ్యంతో స్థానిక శాసనసభ్యుల ఆధ్వర్యంలో నిర్వహించిన ‘తణుకు రోడ్డు రన్ 10K, 5K, 3K’ కార్యక్రమంలో పాల్గొన‌డం ఆనందంగా ఉంద‌న్నారు.

యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా వైజాగ్‌లో ఐదు లక్షల మందితో నిర్వహించిన యోగా మహోత్సవం ద్వారా కూటమి ప్రభుత్వం సాధించిన గిన్నిస్ రికార్డు రాష్ట్ర ఆరోగ్య సంకల్పానికి నిదర్శనం అని అన్నారు మంత్రి గొట్టిపాటి ర‌వికుమార్. ప్రతి కుటుంబం, గ్రామం, పట్టణం పరిశుభ్రంగా, ఆరోగ్యవంతంగా ఉండాలన్నది ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు లక్ష్యం అని స్ప‌ష్టం చేశారు. ఆరోగ్యాంధ్రప్రదేశ్ లక్ష్యసాధనలో భాగంగా ప్రతి ఒక్కరూ రోజూ కొంత సమయాన్ని శారీరక దృఢత్వం కోసం కేటాయించాలని కోరారు .

  • Related Posts

    రాబోయే భ‌విష్య‌త్తును నిర్దేశించేది ఏఐనే

    చెన్నై : : ‘దేశమే ప్రథమం’ అనే సూత్రానికి కట్టుబడి, తమ జ్ఞానం, ఆవిష్కరణలు , నైపుణ్యాలను దేశ నిర్మాణానికి వినియోగించాలని ఉప రాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్ పట్టభద్రులను కోరారు. చెన్నై సమీపంలోని కట్టంకుళత్తూరులో ఉన్న ఎస్.ఆర్.ఎం. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్…

    తెలంగాణ ‘సేఫ్’ డైర‌క్ట‌ర్ గా అవినాష్ మొహంతి

    హైద‌రాబాద్ : తెలంగాణ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఇప్ప‌టికే స‌మ‌ర్థ‌వంత‌మైన పోలీస్ ఆఫీస‌ర్ గా గుర్తింపు పొందారు అవినాష్ మొహంతి. ఆయ‌న‌కు కీల‌క ప‌ద‌వి క‌ట్ట‌బెట్టింది . సేఫ్ డైరెక్ట‌ర్ గా నియ‌మించింది. గతంలో తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *