క్వాంటం కంప్యూట‌ర్ల త‌యారీ కేంద్రంగా ఏపీ

కాబోతోంద‌ని ప్ర‌క‌టించిన సీఎం చంద్ర‌బాబు

అమ‌రావ‌తి : ఏపీ ప్ర‌పంచంలో క్వాంటం కంప్యూట‌ర్ల త‌యారీకి కేరాఫ్ కాబోతోంద‌ని ఆశాభావం వ్య‌క్తం చేశారు సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు. మంగ‌ళ‌వారం వేలాది మంది విద్యార్థుల‌తో ఆయ‌న ముఖాముఖి నిర్వహించారు. ఈ సంద‌ర్భంగా రాష్ట్రానికి సంబంధించి క్వాంటం కంప్యూటింగ్ విజ‌న్ ను ఆవిష్క‌రించారు. రాబోయే ప్ర‌పంచం దీనిని ఉప‌యోగించు కుంటుంద‌ని అన్నారు. అంతే కాదు ఏపీ రాజ‌ధాని అమరావతిలో క్వాంటం కంప్యూటర్లను ఉత్పత్తి చేయడానికి అందరూ సిద్ధంగా ఉన్నారని చెప్పారు. ఈ సంద‌ర్బంగా ప్ర‌క‌టించ‌డం సంతోషంగా ఉంద‌న్నారు సీఎం. దాదాపు 80 శాతం లేదా 85 శాతం కాంపోనెంట్ భాగస్వాములందరూ సిద్ధంగా ఉన్నార‌ని వెల్ల‌డించారు.

ఇదిలా ఉండ‌గా ఈ ప్ర‌క్రియ రెండు సంవత్సరాల లోపు క్వాంటం కంప్యూటర్లు అమరావతిలో ఉత్పత్తి చేయబడతాయని చెప్పారు. ఎవరైనా ఏదైనా నాలెడ్జ్ కంపెనీ లేదా టెక్నాలజీని ప్రారంభించాలన‌ని అనుకుంటే, వారు అమరావతికి రావాలని సీఎం విశ్వాసం వ్యక్తం చేశారు. అంతే కాకుండా ఆంధ్రప్రదేశ్‌లో నిర్వహించిన పరిశోధనలకు క్వాంటం కంప్యూటింగ్‌లో నోబెల్ బహుమతిని గెలుచుకున్న ఎవరికైనా రూ. 100 కోట్ల అవార్డును నాయుడు హామీ ఇచ్చారు. అంతేకాకుండా, ఆవిష్కరణ, ఉత్పత్తి ఆధారిత భవిష్యత్తుకు అనుకూలంగా సాంప్రదాయ ఆలోచనలను విడనాడాలని ఆయన విద్యార్థులకు సూచించారు.

  • Related Posts

    రాబోయే భ‌విష్య‌త్తును నిర్దేశించేది ఏఐనే

    చెన్నై : : ‘దేశమే ప్రథమం’ అనే సూత్రానికి కట్టుబడి, తమ జ్ఞానం, ఆవిష్కరణలు , నైపుణ్యాలను దేశ నిర్మాణానికి వినియోగించాలని ఉప రాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్ పట్టభద్రులను కోరారు. చెన్నై సమీపంలోని కట్టంకుళత్తూరులో ఉన్న ఎస్.ఆర్.ఎం. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్…

    తెలంగాణ ‘సేఫ్’ డైర‌క్ట‌ర్ గా అవినాష్ మొహంతి

    హైద‌రాబాద్ : తెలంగాణ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఇప్ప‌టికే స‌మ‌ర్థ‌వంత‌మైన పోలీస్ ఆఫీస‌ర్ గా గుర్తింపు పొందారు అవినాష్ మొహంతి. ఆయ‌న‌కు కీల‌క ప‌ద‌వి క‌ట్ట‌బెట్టింది . సేఫ్ డైరెక్ట‌ర్ గా నియ‌మించింది. గతంలో తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *