డీటీఓ కిష‌న్ నాయ‌క్ ఆస్తుల విలువ రూ. 250 కోట్లు

ఏసీబీ వలకు చిక్కిన రవాణా శాఖ తిమింగలం

హైద‌రాబాద్ : ఏసీబీ దాడుల‌లో విస్తు పోయే నిజాలు బ‌య‌ట ప‌డ్డాయి. భారీ అవినీతి తిమింగ‌లం చిక్కింది. అధికారం ఉంది క‌దా అని అడ్డ‌గోలుగా సంపాదించిన ఓ అవినీతి జిల్లా స్థాయి అధికారి రెడ్ హ్యాండెడ్ గా ప‌ట్టుబ‌డ‌డం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా క‌ల‌క‌లం రేపింది. ఇందుకు సంబంధించిన వివ‌రాలు ఇలా ఉన్నాయి. మహబూబ్‌నగర్ జిల్లా డిప్యూటీ ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్‌గా విధులు నిర్వహిస్తూ ఉన్నారు కిష‌న్ నాయ‌క్. త‌ను హైదరాబాద్ నగరంలోని బోయినపల్లిలో నివాసం ఉంటున్నాడు.

అవినీతి ఆరోపణల నేపధ్యంలో ఆయన ఇంటితో పాటు, నిజామాబాద్, నారాయణఖేడ్ ప్రాంతాల్లో ఉన్న తన బంధుమిత్రుల ఇళ్లతో కలిపి 12 చోట్ల తనిఖీలు నిర్వహించారు ఏసీబీ అధికారులు. ఈ సోదాల‌లో బైర్లు క‌మ్మేలా విస్తు పోయేలా వాస్త‌వాలు బ‌య‌ట ప‌డ్డాయి. కిష‌న్ నాయ‌క్ కు నారాయణఖేడ్ ప్రాంతంలో 31 ఎకరాలు, నిజామాబాద్ ప్రాంతంలో 10 ఎకరాలు, నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఉన్న లహరి ఇంటర్నేషనల్ హోటల్లో 50% వాటా, రాయల్ ఓక్ ఫర్నిచర్ షాపుకు లీజుకు ఇచ్చిన 3000 గజాల వాణిజ్య స్థలం, కిలో బంగారు ఆభరణాలు, బ్యాంకు ఖాతాలో రూ.1.37 కోట్ల నగదు, అశోక్ టౌన్ షిప్‌లో రెండు ఫ్లాట్లు, 4000 గజాల స్థలంలో పాలి హౌస్ ఉన్నట్లు గుర్తించామని తెలిపారు ఏసీబీ డీజీ చారుసిన్హా

కిషన్ నాయక్ బంధువుల ఇంట్లో దొరికిన ఆస్తి పత్రాలన్నీ స్వాధీనం చేసుకున్నామ‌ని, ఆయన ఆస్తులు రూ.250 కోట్లు ఉంటాయని ప్ర‌క‌టించారు.

  • Related Posts

    రాబోయే భ‌విష్య‌త్తును నిర్దేశించేది ఏఐనే

    చెన్నై : : ‘దేశమే ప్రథమం’ అనే సూత్రానికి కట్టుబడి, తమ జ్ఞానం, ఆవిష్కరణలు , నైపుణ్యాలను దేశ నిర్మాణానికి వినియోగించాలని ఉప రాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్ పట్టభద్రులను కోరారు. చెన్నై సమీపంలోని కట్టంకుళత్తూరులో ఉన్న ఎస్.ఆర్.ఎం. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్…

    తెలంగాణ ‘సేఫ్’ డైర‌క్ట‌ర్ గా అవినాష్ మొహంతి

    హైద‌రాబాద్ : తెలంగాణ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఇప్ప‌టికే స‌మ‌ర్థ‌వంత‌మైన పోలీస్ ఆఫీస‌ర్ గా గుర్తింపు పొందారు అవినాష్ మొహంతి. ఆయ‌న‌కు కీల‌క ప‌ద‌వి క‌ట్ట‌బెట్టింది . సేఫ్ డైరెక్ట‌ర్ గా నియ‌మించింది. గతంలో తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *