శోభారాజు కార్య‌క్ర‌మాల‌కు స‌ర్కార్ స‌హ‌కారం

ప్ర‌క‌టించిన సీఎం చంద్ర‌బాబు నాయుడు

అమ‌రావ‌తి : సంగీతం, సాహిత్యం, సంస్కృతి భారతీయ సంపదకు మూలాలు అని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. కళాకారుల ద్వారా అన్నమయ్య కీర్తలను ప్రజలకు చేరువు చేస్తున్న డాక్టర్ శోభారాజు కార్యక్రమాలకు తమ సహకారం ఎప్పుడూ ఉంటుందని స్ప‌ష్టం చేశారు. అన్నమయ్య అంతర్జాతీయ సంకీర్తన పోటీలు ”తందనానా – 2025”లో విజేతలైన ముగ్గురు గాయనీ గాయకులకు సచివాలయంలోని 5వ బ్లాకులో సీఎం నేడు బంగారు పతకాలను బహుకరించారు. సబ్‌ జూనియర్‌ విభాగంలో భట్టిప్రోలు మేఘన, జూనియర్‌ విభాగంలో చిర్పల్లి శ్రీమహాలక్ష్మి, సీనియర్‌ విభాగంలో సముద్రాల లక్ష్మీ హరిచందన సీఎం చేతుల మీదుగా బంగారు పతకాలను అందుకున్నారు.

ఇదిలా ఉండ‌గా మ‌రో కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు నారా చంద్ర‌బాబు నాయుడు. త‌మ ప్ర‌భుత్వం సాంస్కృతిక‌, క‌ళా, సాహిత్య రంగాల‌కు పెద్ద‌పీట వేస్తుంద‌ని చెప్పారు. ఎక్క‌డైతే క‌వులు, క‌ళాకారులు, ర‌చ‌యిత‌లకు గుర్తింపు ఉంటుందో ఆ రాష్ట్రం సుభిక్షంగా ఉంటుంద‌న్నారు. ఇదే క్ర‌మంలో తాము వ‌చ్చాక తొలిసారిగా వ‌చ్చే ఏడాది జ‌న‌వ‌రిలో విజ‌య‌వాడ వేదికగా మూడు రోజుల పాటు ఆవ‌కాయ్ ఫెస్టివ‌ల్ ను నిర్వ‌హిస్తున్న‌ట్లు చెప్పారు సీఎం. ఇదే స‌మ‌యంలో కార్య‌క్ర‌మం విజ‌య‌వంతం చేసేందుకు గాను రూ. 5 కోట్లు మంజూరు చేసిన‌ట్లు తెలిపారు.

  • Related Posts

    రాబోయే భ‌విష్య‌త్తును నిర్దేశించేది ఏఐనే

    చెన్నై : : ‘దేశమే ప్రథమం’ అనే సూత్రానికి కట్టుబడి, తమ జ్ఞానం, ఆవిష్కరణలు , నైపుణ్యాలను దేశ నిర్మాణానికి వినియోగించాలని ఉప రాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్ పట్టభద్రులను కోరారు. చెన్నై సమీపంలోని కట్టంకుళత్తూరులో ఉన్న ఎస్.ఆర్.ఎం. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్…

    తెలంగాణ ‘సేఫ్’ డైర‌క్ట‌ర్ గా అవినాష్ మొహంతి

    హైద‌రాబాద్ : తెలంగాణ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఇప్ప‌టికే స‌మ‌ర్థ‌వంత‌మైన పోలీస్ ఆఫీస‌ర్ గా గుర్తింపు పొందారు అవినాష్ మొహంతి. ఆయ‌న‌కు కీల‌క ప‌ద‌వి క‌ట్ట‌బెట్టింది . సేఫ్ డైరెక్ట‌ర్ గా నియ‌మించింది. గతంలో తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *