బీజేపీ వ‌చ్చాక దేశంలో మైనార్టీల‌పై దాడులు

సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేసిన సీఎం స్టాలిన్

చెన్నై : త‌మిళ‌నాడు సీఎం ఎంకే స్టాలిన్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఆయ‌న కేంద్ర స‌ర్కార్ ను ఏకి పారేశారు. శ‌నివారం మీడియాతో మాట్లాడారు. బిజెపి అధికారం చేపట్టినప్పటి నుండి మైనారిటీలపై ద్వేషపూరిత ప్రసంగాలు పెరుగుతున్నాయని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ప్రధానమంత్రి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపినప్పటికీ కొన్ని మితవాద హింసాత్మక గ్రూపులు మైనారిటీలపై దాడి చేస్తున్నాయని ఆరోపించ‌చారు. ఇది దేశానికి ఆందోళనకరమైన సందేశాన్ని పంపుతుందని అన్నారు. జబల్పూర్, రాయ్‌పూర్‌లలో మైనారిటీలపై దాడులు జరిగాయని వచ్చిన ఆరోపణలను తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ఉదహరించారు. ఇది ఆమోదయోగ్యం కాదని అన్నారు.

ప్ర‌ధానంగా భారతీయ జనతా పార్టీ (బిజెపి) కేంద్రంలో అధికారం చేపట్టినప్పటి నుండి మైనారిటీలపై ద్వేష పూరిత ప్రసంగాలు 74 శాతం పెరిగాయని ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. కొన్ని మితవాద హింసాత్మక గ్రూపులు చేస్తున్న దాడులు దేశానికి ఆందోళనకరమైన సందేశాన్ని పంపుతున్నాయని ఆయన అన్నారు. మణిపూర్ తర్వాత, జబల్పూర్, రాయ్‌పూర్ , ఇతర ప్రాంతాలలో మైనారిటీలపై దాడుల నివేదికలు సామరస్యాన్ని విలువైన ఎవరికైనా ఆమోదయోగ్యం కాదని పేర్కొన్నారు సీఎం. కేంద్ర బిజెపి ప్రభుత్వం అధికారం చేపట్టినప్పటి నుండి మైనారిటీలపై ద్వేషపూరిత ప్రసంగాలు 74 శాతం పెరగడం రాబోయే తీవ్రమైన ప్రమాదాన్ని సూచిస్తుందని పేర్కొన్నారు.

  • Related Posts

    రాబోయే భ‌విష్య‌త్తును నిర్దేశించేది ఏఐనే

    చెన్నై : : ‘దేశమే ప్రథమం’ అనే సూత్రానికి కట్టుబడి, తమ జ్ఞానం, ఆవిష్కరణలు , నైపుణ్యాలను దేశ నిర్మాణానికి వినియోగించాలని ఉప రాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్ పట్టభద్రులను కోరారు. చెన్నై సమీపంలోని కట్టంకుళత్తూరులో ఉన్న ఎస్.ఆర్.ఎం. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్…

    తెలంగాణ ‘సేఫ్’ డైర‌క్ట‌ర్ గా అవినాష్ మొహంతి

    హైద‌రాబాద్ : తెలంగాణ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఇప్ప‌టికే స‌మ‌ర్థ‌వంత‌మైన పోలీస్ ఆఫీస‌ర్ గా గుర్తింపు పొందారు అవినాష్ మొహంతి. ఆయ‌న‌కు కీల‌క ప‌ద‌వి క‌ట్ట‌బెట్టింది . సేఫ్ డైరెక్ట‌ర్ గా నియ‌మించింది. గతంలో తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *