దూకుడు పెంచిన హైడ్రా క‌మిష‌న‌ర్

ప్ర‌గ‌తి న‌గ‌ర్ చెరువులో ప్ర‌త్యామ్నాయం

హైద‌రాబాద్ : హైద‌రాబాద్ లో హైడ్రా దూకుడు పెంచింది. అక్ర‌మార్కుల‌కు షాక్ ఇస్తోంది. అంతే కాదు ప్ర‌భుత్వ స్థ‌లాల‌ను ఆక్ర‌మించుకుని క‌బ్జాల‌కు పాల్ప‌డిన వారిపై ఉక్కు పాద మోపింది. ఇదే స‌మ‌యంలో చెరువుల పున‌రుద్ద‌ర‌ణ కార్య‌క్ర‌మానికి శ్రీ‌కారం చుట్టారు. చెరువు ప‌క్క‌న ప్ర‌త్యామ్నాయ ఏర్పాట్లు చేయాల‌ని ఆదేశించారు క‌మిష‌నర్. ఇవాళ ప‌లు స్థ‌లాల‌ను విధి నిర్వ‌హ‌ణ‌లో భాగంగా ప‌రిశీలించారు. అక్క‌డ వ్యాపారాలు సుల‌భంగా సాగేలా చ‌ర్య‌లు తీసుకోవాల‌న్నారు. హైడ్రా ప్ర‌జావాణికి వ‌చ్చిన ఫిర్యాదుల నేప‌థ్యంలో ప్ర‌గ‌తిన‌గ‌ర్ చెరువును ప‌రిర‌క్షించేందుకు చ‌ర్య‌లు తీసుకుంటున్నామ‌ని చెప్పారు.

చెరువు ప‌రిస‌రాల్లో చెత్త గుట్ట‌ల‌ను ఇప్ప‌టికే 150 లారీల వ‌ర‌కూ త‌ర‌లించామ‌ని చెప్పారు. చేప‌లు, చికెన్, మాంసం వ్య‌ర్థాలు చెరువులో క‌లుస్తుండ‌డంతో ప‌రిస‌రాల‌న్నీ దుర్గంధంగా మారుతున్నాయ‌ని స్థానికులు ఈ సంద‌ర్భంగా క‌మిష‌న‌ర్‌కు ఫిర్యాదు చేశారు. చిరు వ్యాపారుల‌ను ఇక్క‌డి నుంచి త‌ర‌లించాల‌ని ప‌లువురు కోరారు. ప్ర‌త్యామ్నాయ స్థ‌లం చూపించి చిరు వ్యాపారుల‌ను అక్క‌డ‌కు త‌ర‌లించే ఏర్పాట్లు చేయాల‌ని స్థానిక అధికారుల‌ను హైడ్రా క‌మిష‌న‌ర్ ఆదేశించారు. హైడ్రా అద‌న‌పు డైరెక్ట‌ర్ వ‌ర్ల పాప‌య్య , ఏసీపీ ఉమామ‌హేశ్వ‌ర్ తో పాటు హైడ్రా, జీహెచ్ఎంసీ, రెవెన్యూ, ఇరిగేష‌న్ అధికారులు క‌మిష‌న‌ర్ ప‌ర్య‌ట‌న‌లో ఉన్నారు.

  • Related Posts

    రాబోయే భ‌విష్య‌త్తును నిర్దేశించేది ఏఐనే

    చెన్నై : : ‘దేశమే ప్రథమం’ అనే సూత్రానికి కట్టుబడి, తమ జ్ఞానం, ఆవిష్కరణలు , నైపుణ్యాలను దేశ నిర్మాణానికి వినియోగించాలని ఉప రాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్ పట్టభద్రులను కోరారు. చెన్నై సమీపంలోని కట్టంకుళత్తూరులో ఉన్న ఎస్.ఆర్.ఎం. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్…

    తెలంగాణ ‘సేఫ్’ డైర‌క్ట‌ర్ గా అవినాష్ మొహంతి

    హైద‌రాబాద్ : తెలంగాణ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఇప్ప‌టికే స‌మ‌ర్థ‌వంత‌మైన పోలీస్ ఆఫీస‌ర్ గా గుర్తింపు పొందారు అవినాష్ మొహంతి. ఆయ‌న‌కు కీల‌క ప‌ద‌వి క‌ట్ట‌బెట్టింది . సేఫ్ డైరెక్ట‌ర్ గా నియ‌మించింది. గతంలో తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *