ఈసీ ఈవీఎం స‌ర్వేపై ప్రియాంక్ ఖ‌ర్గే ఫైర్

గణాంకాల పరంగా బలహీనమైనద‌ని ఆగ్ర‌హం

బెంగళూరు : క‌ర్ణాట‌క రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి ప్రియాంక్ ఖ‌ర్గే సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. ఆయ‌న ఎన్నిక‌ల సంఘం నిర్వాకంపై మండిప‌డ్డారు. శుక్ర‌వారం ఖ‌ర్గే మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో ఎన్నిక‌ల సంఘం చేపట్టిన ఈవీఎం స‌ర్వేపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. గ‌ణాంకాల‌న్నీ త‌ప్పుల త‌డ‌క‌గా ఉన్నాయ‌ని, ఇది పూర్తిగా ప‌క్ష‌పాతంతో కూడుకుని ఉన్న‌ద‌ని మండిప‌డ్డారు. రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ద్వారా ఎన్నికల కమిషన్ నియమించిన సర్వేను ప్రధానమంత్రి కార్యాలయంతో సంబంధం ఉన్న వ్యక్తి నిర్వహించారని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేయ‌డం ప్రాధాన్య‌త సంత‌రించుకుంది. దీనిపై త‌మ‌కు న‌మ్మ‌కం లేద‌న్నారు.

ఇదిలా ఉండ‌గా కర్ణాటకలో ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల (EVMలు)పై ఓటర్ల నమ్మకంపై ఇటీవల నిర్వహించిన సర్వే విశ్వసనీయతపై కాంగ్రెస్ మంత్రి ప్రశ్నలు లేవనెత్తారు. ఈ సర్వే అసెంబ్లీ నియోజకవర్గానికి 50 మంది ప్రతివాదులను మాత్రమే కవర్ చేసిందని, ఇది గణాంక పరంగా బలహీనంగా ఉందని మండిప‌డ్డారు. విస్తృత నమూనా లోపాలు , ఎంపిక పక్షపాతానికి గురయ్యే అవకాశం ఉందని, తద్వారా అర్థవంతమైన తీర్మానాలు చేయడానికి ఇది అనుచితమని ఖర్గే హైలైట్ చేశారు.
మే 2025లో నిర్వహించిన సర్వే. కాంగ్రెస్ బహిర్గతం చేసిన వివరణాత్మక ఓటు చోరీ ఆగస్టు 2025లో వెలువడింది. సర్వేలో అసెంబ్లీకి 50 మంది ప్రతివాదులు మాత్రమే ఉన్నార‌ని అన్నారు. ఈ స‌ర్వే బ‌క్వాస్ అని తాము ఒప్పుకునేది లేద‌ని స్ప‌ష్టం చేశారు.

  • Related Posts

    రాబోయే భ‌విష్య‌త్తును నిర్దేశించేది ఏఐనే

    చెన్నై : : ‘దేశమే ప్రథమం’ అనే సూత్రానికి కట్టుబడి, తమ జ్ఞానం, ఆవిష్కరణలు , నైపుణ్యాలను దేశ నిర్మాణానికి వినియోగించాలని ఉప రాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్ పట్టభద్రులను కోరారు. చెన్నై సమీపంలోని కట్టంకుళత్తూరులో ఉన్న ఎస్.ఆర్.ఎం. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్…

    తెలంగాణ ‘సేఫ్’ డైర‌క్ట‌ర్ గా అవినాష్ మొహంతి

    హైద‌రాబాద్ : తెలంగాణ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఇప్ప‌టికే స‌మ‌ర్థ‌వంత‌మైన పోలీస్ ఆఫీస‌ర్ గా గుర్తింపు పొందారు అవినాష్ మొహంతి. ఆయ‌న‌కు కీల‌క ప‌ద‌వి క‌ట్ట‌బెట్టింది . సేఫ్ డైరెక్ట‌ర్ గా నియ‌మించింది. గతంలో తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *