జొన్న‌బండ‌లో పార్కును కాపాడిన హైడ్రా

1444 గ‌జాల పార్కు చుట్టూ హైడ్రా ఫెన్సింగ్‌

హైద‌రాబాద్ : రోజు రోజుకు హైడ్రా స్పీడ్ పెంచుతోంది. అక్ర‌మార్కులు, భూ క‌బ్జాదారుల‌కు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. ఇందులో భాగంగా హైద‌రాబాద్ లో ప‌లు ప్రాంతాల‌లో ఆక్ర‌మ‌ణ‌ల‌ను గుర్తించే ప‌నిలోప‌డింది. ఇదిలా ఉండ‌గా తాజాగా మేడ్చ‌ల్ – మ‌ల్కాజిగిరి జిల్లా ఓల్డ్ ఆల్వాల్ పరిధి జొన్న‌బండ‌లోని ఎంహెచ్ఆర్ కాలనీలో పార్కును హైడ్రా కాపాడింది. 1444.40 గ‌జాల‌ పార్కు స్థ‌లం చుట్టూ ఫెన్సింగ్ వేసింది. లే ఔట్ ప్ర‌కారం సర్వే నంబర్లు 575, 576 (పార్ట్), 577, 578 (పార్ట్), 598, 580 (పార్ట్)లలో మొత్తం 1444.40 గజాల స్థ‌లాన్ని పార్కు కోసం కేటాయించారు.

దీనిని ఆక్ర‌మించేందుకు కొంత‌మంది ప్ర‌య‌త్నిస్తున్నార‌ని స్థానికులు హైడ్రా ప్ర‌జా వాణిలో ఫిర్యాదు చేశారు. దీంతో హైడ్రా క‌మిష‌న‌ర్ ఏవీ రంగ‌నాథ్ ఆదేశాల మేర‌కు సంబంధిత అధికారుల‌తో క్షేత్ర స్థాయిలో హైడ్రా ప‌రిశీలించింది. పార్కు స్థ‌లంగా నిర్ధారించుకుంది. హైడ్రా ఫెన్సింగ్ వేసింది. ప్ర‌జ‌ల‌కు ప్రాణ వాయువును అందించే పార్కును కాపాడిన హైడ్రాకు స్థానికులు కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. చెత్త వేయ‌కుండా వెంట‌నే పార్కుగా అభివృద్ధి చేయాల‌ని జీహెచ్ ఎంసీని కోరుతామ‌న్నారు.

  • Related Posts

    రాబోయే భ‌విష్య‌త్తును నిర్దేశించేది ఏఐనే

    చెన్నై : : ‘దేశమే ప్రథమం’ అనే సూత్రానికి కట్టుబడి, తమ జ్ఞానం, ఆవిష్కరణలు , నైపుణ్యాలను దేశ నిర్మాణానికి వినియోగించాలని ఉప రాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్ పట్టభద్రులను కోరారు. చెన్నై సమీపంలోని కట్టంకుళత్తూరులో ఉన్న ఎస్.ఆర్.ఎం. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్…

    తెలంగాణ ‘సేఫ్’ డైర‌క్ట‌ర్ గా అవినాష్ మొహంతి

    హైద‌రాబాద్ : తెలంగాణ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఇప్ప‌టికే స‌మ‌ర్థ‌వంత‌మైన పోలీస్ ఆఫీస‌ర్ గా గుర్తింపు పొందారు అవినాష్ మొహంతి. ఆయ‌న‌కు కీల‌క ప‌ద‌వి క‌ట్ట‌బెట్టింది . సేఫ్ డైరెక్ట‌ర్ గా నియ‌మించింది. గతంలో తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *