రైతుల సంక్షేమం స‌ర్కార్ ల‌క్ష్యం

స్ప‌ష్టం చేసిన సీఎం ఎ. రేవంత్ రెడ్డి

ఆదిలాబాద్ జిల్లా : త‌మ ప్ర‌భుత్వం రైతు సంక్షేమం కోసం ప‌ని చేస్తుంద‌ని చెప్పారు ముఖ్య‌మంత్రి ఎ. రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ పాలన అంటే రైతు సంక్షేమం, రైతు క్షేత్రం సస్యశ్యామలం, సాగు జలాలతో పచ్చటి పొలాలను తడపడం అన్నారు. అందుకే గడచిన రెండేళ్లలో పెండింగ్ ప్రాజెక్టుల పై దృష్టి పెట్టామ‌ని చెప్పారు. నదుల నుండి మడులకు నీళ్లు పారించడమే లక్ష్యంగా పని చేశాం అన్నారు. ఆ క్రమంలో నిర్మల్ జిల్లా మామడ మండలం పొంకల్ గ్రామంలో సదర్మట్ బ్యారేజీని పూర్తి చేసి ఈ రోజు తెలంగాణ ప్రజలకు అంకితం చేయ‌డం జ‌రిగింద‌న్నారు.

ఈ రోజు యాసంగి పంటకు నీటిని విడుదల చేశామ‌న్నారు. రైతుల కళ్లల్లో ఆనందం చూడ‌డం త‌న‌కు సంతోషం క‌లిగిస్తోంద‌ని చెప్పారు ముఖ్య‌మంత్రి ఎ. రేవంత్ రెడ్డి. రాబోయే రోజుల్లో వ్య‌వ‌సాయ రంగానికి మ‌రిన్ని నిధులు మంజూరు చేస్తామ‌న్నారు. రైతుల సంక్షేమం కోసం ఎన్ని కోట్లు అయినా ఖ‌ర్చు చేసేందుకు వెనుకాడ బోమంటూ స్ప‌ష్టం చేశారు సీఎం. ఇప్ప‌టికే రాష్ట్ర బ‌డ్జెట్ లో అత్య‌ధిక నిధుల‌ను కేటాయించ‌డ జ‌రిగింద‌న్నారు రేవంత్ రెడ్డి. ఈ కార్యక్రమంలో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు, మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, ఇతర ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.

  • Related Posts

    రాబోయే భ‌విష్య‌త్తును నిర్దేశించేది ఏఐనే

    చెన్నై : : ‘దేశమే ప్రథమం’ అనే సూత్రానికి కట్టుబడి, తమ జ్ఞానం, ఆవిష్కరణలు , నైపుణ్యాలను దేశ నిర్మాణానికి వినియోగించాలని ఉప రాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్ పట్టభద్రులను కోరారు. చెన్నై సమీపంలోని కట్టంకుళత్తూరులో ఉన్న ఎస్.ఆర్.ఎం. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్…

    తెలంగాణ ‘సేఫ్’ డైర‌క్ట‌ర్ గా అవినాష్ మొహంతి

    హైద‌రాబాద్ : తెలంగాణ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఇప్ప‌టికే స‌మ‌ర్థ‌వంత‌మైన పోలీస్ ఆఫీస‌ర్ గా గుర్తింపు పొందారు అవినాష్ మొహంతి. ఆయ‌న‌కు కీల‌క ప‌ద‌వి క‌ట్ట‌బెట్టింది . సేఫ్ డైరెక్ట‌ర్ గా నియ‌మించింది. గతంలో తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *