న‌ల్ల‌గొండ అభివృద్ది కోసం మ‌రో రూ. 2 వేల కోట్లు

తీసుకు వ‌చ్చేందుకు కృషి చేస్తాన‌న్న కోమ‌టి రెడ్డి

న‌ల్ల‌గొండ జిల్లా : న‌ల్ల‌గొండ జిల్లాకు ఎంత చేసినా త‌క్కువేన‌ని అన్నారు రాష్ట్ర రోడ్లు, భ‌వ‌నాల శాఖ మంత్రి కోమ‌టి రెడ్డి వెంక‌ట్ రెడ్డి. ఇప్ప‌టికే ప‌ట్ట‌ణ అభివృద్ది కోసం రూ. 2000 కోట్లు మంజూరు చేశామ‌న్నారు. మౌలిక వ‌స‌తుల క‌ల్ప‌న కొన‌సాగుతుంద‌న్నారు. మ‌రో వైపు ఇంకా అభివృద్ది ప‌నుల కోసం ఇంకా రూ. 2000 కోట్లు తీసుకు వ‌చ్చేందుకు తాను ప్ర‌య‌త్నం చేస్తాన‌ని చెప్పారు. ప్రజలకు అవసరమైన మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు కోమ‌టిరెడ్డి వెంక‌ట్ రెడ్డి. ఇదిలా ఉండ‌గా నల్గొండను మున్సిపల్ కార్పొరేషన్‌గా ప్రకటించిన సందర్భంగా నల్గొండ ప్రజల పక్షాన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ధ‌న్య‌వాదాలు తెలిపారు. ప్రజా ప్రభుత్వంలో నల్గొండను సూపర్ స్మార్ట్ సిటీగా అభివృద్ధి చేస్తామ‌న్నారు.

కార్పొరేషన్ హోదాతో కేంద్రం నుంచి నేరుగా నిధులు తెచ్చుకునే అవకాశం లభించిందని చెప్పారు కోమ‌టిరెడ్డి వెంక‌ట్ రెడ్డి. కేవలం 25 నెలల్లోనే కార్పొరేషన్ హోదాను సాధించడం జ‌రిగింద‌న్నారు. గతంతో పోలిస్తే మరింత వేగంగా అభివృద్ధి సాధ్యమవుతుంద‌ని తెలిపారు కోమ‌టిరెడ్డి వెంక‌ట్ రెడ్డి.
ఇందిరమ్మ ఇండ్లు, డబుల్ రోడ్లు, సెంట్రల్ లైటింగ్, రూ.700 కోట్లతో ఓఆర్‌ఆర్, ధర్వేశిపురం వరకు 6 లైన్ల రోడ్డు, బ్రహ్మగారి గుట్ట–లతీఫ్ సాబ్ దర్గా గుట్ట అభివృద్ధి, దొరేపల్లి–అనంతారం రోడ్లు, ఎస్ఎల్‌బీసీ పూర్తి లక్ష్యం, ఏఎంఆర్‌పీ కాలువల లైనింగ్‌కు రూ.450 కోట్లు కేటాయించామ‌న్నారు.

  • Related Posts

    రాబోయే భ‌విష్య‌త్తును నిర్దేశించేది ఏఐనే

    చెన్నై : : ‘దేశమే ప్రథమం’ అనే సూత్రానికి కట్టుబడి, తమ జ్ఞానం, ఆవిష్కరణలు , నైపుణ్యాలను దేశ నిర్మాణానికి వినియోగించాలని ఉప రాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్ పట్టభద్రులను కోరారు. చెన్నై సమీపంలోని కట్టంకుళత్తూరులో ఉన్న ఎస్.ఆర్.ఎం. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్…

    తెలంగాణ ‘సేఫ్’ డైర‌క్ట‌ర్ గా అవినాష్ మొహంతి

    హైద‌రాబాద్ : తెలంగాణ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఇప్ప‌టికే స‌మ‌ర్థ‌వంత‌మైన పోలీస్ ఆఫీస‌ర్ గా గుర్తింపు పొందారు అవినాష్ మొహంతి. ఆయ‌న‌కు కీల‌క ప‌ద‌వి క‌ట్ట‌బెట్టింది . సేఫ్ డైరెక్ట‌ర్ గా నియ‌మించింది. గతంలో తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *