గూగుల్ అపాక్ అధ్య‌క్షుడు సంజ‌య్ గుప్తాతో సీఎం భేటీ

సైబ‌ర్ సెక్యూరిటీ, ప‌ట్ట‌ణ కాలుష్యంపై విస్తృత చ‌ర్చ‌లు

హైద‌రాబాద్ : తెలంగాణ ముఖ్య‌మంత్రి ఎ. రేవంత్ రెడ్డి నేతృత్వంలోని తెలంగాణ రైజింగ్ బృందం స్విట్జ‌ర్లాండ్ లోని దావోస్ లో బిజీ బిజీగా గ‌డుపుతోంది. ఇక్క‌డ జ‌రుగుతున్న ప్ర‌పంచ ఆర్థిక స‌ద‌స్సు 2026లో పాల్గొంది. దిగ్గ‌జ కంపెనీల‌తో స‌మావేశ‌మైంది. ఈ సంద‌ర్బంగా గూగుల్ అపాక్ అధ్యక్షుడు సంజ‌య్ గుప్తాతో భేటీ అయ్యారు సీఎం రేవంత్ రెడ్డి. వాతావరణ మార్పు, స్థిరమైన వ్యవసాయం, పట్టణ కాలుష్యంపై చర్చలు జరిపారు. ప్ర‌త్యేకించి ట్రాఫిక్ నిర్వహణ, సైబర్ భద్రత, స్టార్టప్ ఆవిష్కరణలలో సహకారాన్ని అన్వేషిస్తూ తెలంగాణ CURE, PURE , RARE ఫ్రేమ్‌వర్క్ , కోర్ హైదరాబాద్‌ను కాలుష్య రహితంగా మార్చాలనే మా దార్శనికతను పంచుకోవ‌డం జ‌రిగింది.

భారతదేశంలో మొట్టమొదటి Google for Startups హబ్‌ను హైదరాబాద్‌లో ఏర్పాటు చేసినందుకు నేను గూగుల్ సిఈఓ సుంద‌ర్ పిచాయ్, సీనియ‌ర్ ఆఫీస‌ర్ సంజ‌య్ గుప్తాల‌కు ధన్యవాదాలు తెలిపారు. అధిక ఎరువుల వాడకాన్ని తగ్గించడం, నేల ఆరోగ్యాన్ని కాపాడటానికి స్థిరమైన వ్యవసాయాన్ని ప్రోత్సహించడం గురించి ప్ర‌త్యేకంగా చ‌ర్చించామ‌న్నారు సీఎం రేవంత్ రెడ్డి. వాతావరణ చర్య, వ్యవసాయం, స్టార్టప్‌లు ,డిజిటల్ మౌలిక సదుపాయాలలో తెలంగాణకు Google పూర్తి మద్దతును ఇస్తామ‌ని ప్ర‌క‌టించారు మిస్ట‌ర్ గుప్తా.

  • Related Posts

    రాబోయే భ‌విష్య‌త్తును నిర్దేశించేది ఏఐనే

    చెన్నై : : ‘దేశమే ప్రథమం’ అనే సూత్రానికి కట్టుబడి, తమ జ్ఞానం, ఆవిష్కరణలు , నైపుణ్యాలను దేశ నిర్మాణానికి వినియోగించాలని ఉప రాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్ పట్టభద్రులను కోరారు. చెన్నై సమీపంలోని కట్టంకుళత్తూరులో ఉన్న ఎస్.ఆర్.ఎం. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్…

    తెలంగాణ ‘సేఫ్’ డైర‌క్ట‌ర్ గా అవినాష్ మొహంతి

    హైద‌రాబాద్ : తెలంగాణ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఇప్ప‌టికే స‌మ‌ర్థ‌వంత‌మైన పోలీస్ ఆఫీస‌ర్ గా గుర్తింపు పొందారు అవినాష్ మొహంతి. ఆయ‌న‌కు కీల‌క ప‌ద‌వి క‌ట్ట‌బెట్టింది . సేఫ్ డైరెక్ట‌ర్ గా నియ‌మించింది. గతంలో తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *