జ‌ర్న‌లిస్టుల‌కు పెన్ష‌న్ సౌక‌ర్యం క‌ల్పిస్తాం

మంత్రి డాక్ట‌ర్ శ‌ర‌ణ్ ప్ర‌కాష్ ఆర్ పాటిల్

రాయ‌చూర్ : క‌ర్ణాట‌క రాష్ట్ర స‌ర్కార్ తీపి క‌బురు చెప్పింది మీడియా రంగంలో ప‌ని చేస్తున్న జ‌ర్న‌లిస్టుల‌కు. ఈ సంద‌ర్భంగా సీనియ‌ర్ జ‌ర్న‌లిస్టుల‌కు భ‌రోసా క‌ల్పించేలా చ‌ర్య‌లు తీసుకుంటున్న‌ట్లు తెలిపారు రాష్ట్ర వైద్య విద్య, నైపుణ్యాభివృద్ధి, జీవనోపాధి , రాయచూర్ జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి డాక్టర్ శరణ్ ప్రకాష్ ఆర్. పాటిల్. రాయ‌చూర్ లో జ‌రిగిన కార్య‌క్ర‌మంలో ఆయ‌న జ‌ర్న‌లిస్టుల‌కు హెల్త్ కార్డుల‌ను పంపిణీ చేశారు. ఈ సంద‌ర్బంగా పాటిల్ ప్రసంగించారు. తమ వృత్తి ద్వారా సమాజానికి గణనీయమైన కృషి చేసి పదవీ విరమణ చేసిన సీనియర్ జర్నలిస్టులకు పెన్షన్ సౌకర్యాలు కల్పిస్తున్నామని చెప్పారు.

ఇందులో భాగంగా ఈ పెన్షన్ పథకం నియమాలు, విధానాలను సరళీకృతం చేయడానికి చర్యలు తీసుకుంటామని డాక్టర్ పాటిల్ స్ప‌ష్టం చేశారు. అధికారులతో చర్చించిన తర్వాత, యశస్విని ఆరోగ్య పథకం ప్రయోజనాలను సీనియర్ జర్నలిస్టులకు కూడా విస్తరించాలని నిర్ణ‌యించామ‌న్నారు. ఈ మేర‌కు రాష్ట్ర కేబినెట్ సమావేశంలో చ‌ర్చించామ‌ని, ఇందుకు అంద‌రూ సానుకూలంగా స్పందించార‌ని చెప్పారు. త్వ‌ర‌లోనే విధి విధానాల‌ను రూపొందించాల‌ని సంబంధిత శాఖ అధికారుల‌ను ఆదేశించ‌డం కూడా జ‌రిగింద‌న్నారు.

  • Related Posts

    రాబోయే భ‌విష్య‌త్తును నిర్దేశించేది ఏఐనే

    చెన్నై : : ‘దేశమే ప్రథమం’ అనే సూత్రానికి కట్టుబడి, తమ జ్ఞానం, ఆవిష్కరణలు , నైపుణ్యాలను దేశ నిర్మాణానికి వినియోగించాలని ఉప రాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్ పట్టభద్రులను కోరారు. చెన్నై సమీపంలోని కట్టంకుళత్తూరులో ఉన్న ఎస్.ఆర్.ఎం. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్…

    తెలంగాణ ‘సేఫ్’ డైర‌క్ట‌ర్ గా అవినాష్ మొహంతి

    హైద‌రాబాద్ : తెలంగాణ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఇప్ప‌టికే స‌మ‌ర్థ‌వంత‌మైన పోలీస్ ఆఫీస‌ర్ గా గుర్తింపు పొందారు అవినాష్ మొహంతి. ఆయ‌న‌కు కీల‌క ప‌ద‌వి క‌ట్ట‌బెట్టింది . సేఫ్ డైరెక్ట‌ర్ గా నియ‌మించింది. గతంలో తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *