ఆర్టీఐ క‌మిష‌న‌ర్ల‌కు చంద్ర‌బాబు అభినంద‌న

ప‌ద‌వికి వ‌న్నె తీసుకు రావాల‌ని సూచ‌న

అమ‌రావ‌తి : ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర స‌మాచార హ‌క్కు క‌మిష‌న‌ర్లు (ఆర్టీఐ) గా కొలువు తీరారు చీఫ్ కమిషనర్ వజ్జా శ్రీనివాసరావు, కమిషనర్లు వంటేరు రవిబాబు, గాజుల ఆదెన్న, పీఎస్ నాయుడు, వీఎస్‌కే చక్రవర్తి. బాధ్య‌త‌లు స్వీక‌రించిన అనంత‌రం మ‌ర్యాద పూర్వ‌కంగా ఏపీ స‌చివాల‌యంలోని సీఎం క్యాంపు కార్యాల‌యంలో రాష్ట్ర ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడును క‌లుసుకున్నారు. ఈ సంద‌ర్బంగా నూత‌నంగా బాధ్య‌త‌లు స్వీక‌రించిన ఆర్టీఐ క‌మిష‌న‌ర్ల‌ను ప్ర‌త్యేకంగా అభినందించారు నారా చంద్రబాబు నాయుడు. ఆర్టీఐ క‌మిష‌న‌ర్లుగా మీపై గురుతర‌మైన బాధ్య‌త ఉంద‌ని స్ప‌ష్టం చేశారు.

గ‌తంలో కొలువు తీరిన వైఎస్సార్సీపీ జ‌గ‌న్ రెడ్డి స‌ర్కార్ స‌మాచార హ‌క్కు క‌మిష‌న్ ను నిర్వీర్యం చేసింద‌ని పేర్కొన్నారు. కానీ కూట‌మి ప్ర‌భుత్వం కొలువు తీరిన త‌ర్వాత అన్ని వ్య‌వ‌స్థ‌ల‌ను గాడిలో పెట్టేందుకు చ‌ర్య‌లు తీసుకున్నామ‌ని తెలిపారు. ఇప్ప‌టి వ‌ర‌కు ఆర్టీఐ క‌మిష‌న్ లో పేరుకు పోయిన ఫైళ్ల‌ను ప‌రిష్క‌రించేందుకు చ‌ర్య‌లు తీసుకోవాల‌ని సూచించారు. పూర్తి పార‌ద‌ర్శ‌క‌త‌తో వ్య‌వ‌హ‌రించాలని, దేశానికే ఆద‌ర్శ ప్రాయంగా నిల‌వాల‌ని కోరారు. ఆర్టీఐ క‌మిష‌న్ కు పూర్వ వైభ‌వం తీసుకు రావాల‌ని హిత‌వు ప‌లికారు.

  • Related Posts

    రాబోయే భ‌విష్య‌త్తును నిర్దేశించేది ఏఐనే

    చెన్నై : : ‘దేశమే ప్రథమం’ అనే సూత్రానికి కట్టుబడి, తమ జ్ఞానం, ఆవిష్కరణలు , నైపుణ్యాలను దేశ నిర్మాణానికి వినియోగించాలని ఉప రాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్ పట్టభద్రులను కోరారు. చెన్నై సమీపంలోని కట్టంకుళత్తూరులో ఉన్న ఎస్.ఆర్.ఎం. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్…

    తెలంగాణ ‘సేఫ్’ డైర‌క్ట‌ర్ గా అవినాష్ మొహంతి

    హైద‌రాబాద్ : తెలంగాణ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఇప్ప‌టికే స‌మ‌ర్థ‌వంత‌మైన పోలీస్ ఆఫీస‌ర్ గా గుర్తింపు పొందారు అవినాష్ మొహంతి. ఆయ‌న‌కు కీల‌క ప‌ద‌వి క‌ట్ట‌బెట్టింది . సేఫ్ డైరెక్ట‌ర్ గా నియ‌మించింది. గతంలో తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *