అస్త‌మించ‌ని సూరీడు ప‌రిటాల ర‌వీంద్ర‌

వెంక‌టాపురంలో ఘ‌నంగా నివాళులు

అనంత‌పురం జిల్లా : తెలుగుదేశం పార్టీకి చెందిన మాజీ మంత్రి, దివంగ‌త ప‌రిటాల ర‌వీంద్ర వ‌ర్ధంతి సంద‌ర్బంగా వెంక‌టాపురంలోని స్వ‌స్థ‌లంలో ఆయ‌నకు ఘ‌నంగా నివాళులు అర్పించారు. వేలాది మంది హాజ‌ర‌య్యారు. క‌న్నీటి నివాళులు అర్పించారు. జోహార్ ర‌వ‌న్న‌, అమ‌ర్ ర‌హే ర‌వ‌న్న అంటూ నినాదాలు చేశారు. ప‌రిటాల ర‌వీంద్ర భార్య‌, ఎమ్మెల్యే, మాజీ మంత్రి ప‌రిటాల సునీత‌, కొడుకు , టీడీపీ సీనియ‌ర్ నేత ప‌రిటాల శ్రీ‌రామ్, సోద‌రుడు, కోడ‌ళ్లు , బంధువులు, ఆత్మీయులు, స‌హ‌చ‌రులు, అభిమానులు తండోప తండాలుగా త‌ర‌లి వ‌చ్చారు.

టీడీపీకి చెందిన ప్ర‌జా ప్ర‌తినిధులు హాజ‌ర‌య్యారు. ఈ సంద‌ర్బంగా దివంగ‌త ప‌రిటాల ర‌వీంద్ర‌తో త‌మ‌కు ఉన్న సాన్నిహిత్యాన్ని గుర్తు చేసుకున్నారు. ప్ర‌జ‌ల మ‌నిషిగా ప‌రిటాల నిలిచి పోతార‌ని పేర్కొన్నారు. పేద‌ల పెన్నిధిగా, ప్ర‌జ‌ల కోసం చివ‌రి దాకా బ‌తికిన అరుదైన నాయ‌కుడు అని ప్ర‌శంస‌లు కురిపించారు. ప్ర‌జా నాయ‌కుడికి మ‌ర‌ణం లేద‌న్నారు. సూర్య చంద్రులు ఉన్నంత వ‌ర‌కు ప‌రిటాల ర‌వీంద్ర బ‌తికే ఉంటార‌ని స్ప‌ష్టం చేశారు. ఆయ‌న భౌతికంగా లేక పోయినా ర‌వీంద్ర చేసిన సేవ‌లు ఎల్ల‌ప్ప‌టికీ నిలిచే ఉంటాయ‌న్నారు.

  • Related Posts

    రాబోయే భ‌విష్య‌త్తును నిర్దేశించేది ఏఐనే

    చెన్నై : : ‘దేశమే ప్రథమం’ అనే సూత్రానికి కట్టుబడి, తమ జ్ఞానం, ఆవిష్కరణలు , నైపుణ్యాలను దేశ నిర్మాణానికి వినియోగించాలని ఉప రాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్ పట్టభద్రులను కోరారు. చెన్నై సమీపంలోని కట్టంకుళత్తూరులో ఉన్న ఎస్.ఆర్.ఎం. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్…

    తెలంగాణ ‘సేఫ్’ డైర‌క్ట‌ర్ గా అవినాష్ మొహంతి

    హైద‌రాబాద్ : తెలంగాణ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఇప్ప‌టికే స‌మ‌ర్థ‌వంత‌మైన పోలీస్ ఆఫీస‌ర్ గా గుర్తింపు పొందారు అవినాష్ మొహంతి. ఆయ‌న‌కు కీల‌క ప‌ద‌వి క‌ట్ట‌బెట్టింది . సేఫ్ డైరెక్ట‌ర్ గా నియ‌మించింది. గతంలో తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *