నేడే ఏపీ కేబినెట్ కీల‌క స‌మావేశం

వెల్ల‌డించిన సీఎస్ విజ‌యానంద్

అమ‌రావ‌తి : ఏపీ స‌ర్కార్ ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి కె. విజ‌యానంద్ కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. ఈనెల 29వ తేదీ బుధ‌వారం రోజు ఏపీ కేబిన‌ట్ కీల‌క సమావేశం జ‌రుగుతుంద‌ని తెలిపారు. ఉదయం 10 గంటలకు భేటీ కానుంద‌ని స్ప‌ష్టం చేశారు. పలు కీలక అంశాలపై చర్చించనుంద‌ని పేర్కొన్నారు. పలు సంస్థలకు భూ కేటాయింపులు చేసే అవకాశం ఉంది. ఎజెండా అంశాలు పూర్తయ్యాక ఏపీ బడ్జెట్ సెషన్ పై చర్చ జ‌ర‌గ‌నుంది. అసెంబ్లీ సమావేశాల నిర్వహణపై నిర్ణయం తీసుకునే అవకాశం కూడా ఉంది.

అమరావతి గ్రామాల్లో అనాథలైన పిల్లలకు పెన్షన్ పథకం, రివర్ ఫ్రంట్ లో మెరీనా అభివృద్ధికి ఆమోదం తెలపనుంది ఏపీ కేబినెట్ . రాజధానిలో వీధిపోటు ప్లాట్లు 112 వేరే చోట ఇచ్చేందుకు అనుమతి ఇవ్వ‌డం, హడ్కో నుంచి రూ.4,450 కోట్ల రుణానికి అనుమతి ఇచ్చే విష‌యంపై చ‌ర్చ జ‌ర‌గ‌నుంది. ఈ స‌మావేశంలో వైసీపీ విమర్శలు తిప్పికొట్టాలని మంత్రులకు చంద్రబాబు దిశానిర్దేశం చేయ‌నున్నారు. సోషల్ మీడియాలో దుష్ప్రచారంపై అలెర్ట్ గా ఉండాల‌ని హెచ్చ‌రించ‌రాఉ. ఇదిలా ఉండ‌గ‌గా దావోస్ పర్యటన పైనా ఏపీ కేబినెట్ భేటీలో చర్చించే అవకాశం ఉంది.

  • Related Posts

    రాబోయే భ‌విష్య‌త్తును నిర్దేశించేది ఏఐనే

    చెన్నై : : ‘దేశమే ప్రథమం’ అనే సూత్రానికి కట్టుబడి, తమ జ్ఞానం, ఆవిష్కరణలు , నైపుణ్యాలను దేశ నిర్మాణానికి వినియోగించాలని ఉప రాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్ పట్టభద్రులను కోరారు. చెన్నై సమీపంలోని కట్టంకుళత్తూరులో ఉన్న ఎస్.ఆర్.ఎం. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్…

    తెలంగాణ ‘సేఫ్’ డైర‌క్ట‌ర్ గా అవినాష్ మొహంతి

    హైద‌రాబాద్ : తెలంగాణ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఇప్ప‌టికే స‌మ‌ర్థ‌వంత‌మైన పోలీస్ ఆఫీస‌ర్ గా గుర్తింపు పొందారు అవినాష్ మొహంతి. ఆయ‌న‌కు కీల‌క ప‌ద‌వి క‌ట్ట‌బెట్టింది . సేఫ్ డైరెక్ట‌ర్ గా నియ‌మించింది. గతంలో తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *