అగ్ని ప్ర‌మాదాల నివార‌ణ‌పై హైడ్రా ఫోక‌స్

స్ప‌ష్టం చేసిన క‌మిష‌న‌ర్ ఏవీ రంగ‌నాథ్

హైద‌రాబాద్ : హైడ్రా క‌మిష‌న‌ర్ ఏవీ రంగ‌నాథ్ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ఇటీవ‌ల హైద‌రాబాద్ లో చోటు చేసుకుంటున్న వ‌రుస అగ్ని ప్ర‌మాద ఘ‌ట‌న‌ల‌పై దృష్టి సారించారు. ఇందుకు సంబంధించి ప్ర‌తి ఒక్క‌రు జాగ్ర‌త్త‌లు పాటించాల‌ని సూచించారు. నాంప‌ల్లిలో జ‌రిగిన ఫ‌ర్నీచ‌ర్ దుకాణం సెల్లార్‌ల‌లో లెక్క‌కు మించిన ఫ‌ర్నీచ‌ర్‌ను పెట్ట‌డం జ‌రిగింద‌న్నారు. సెల్లార్లోనే వాచ్‌మ్యాన్‌కు నివాసం క‌ల్పించడం ప‌ట్ల మండిప‌డ్డారు. అగ్ని ప్ర‌మాదం జ‌రిగిన‌ప్పుడు షాపులో ఉన్న వారు బ‌య‌ట‌పడినా.. సెల్లార్‌లో ఉన్న వారు మంట‌ల్లో చిక్కుకున్నారని అన్నారు. హైడ్రా ఆధ్వ‌ర్యంలో కీల‌క స‌మావేశం నిర్వ‌హించారు. ఈ స‌మావేశానికి హాజ‌ర‌య్యారు క‌మిష‌న‌ర్. ఇందులో కాపాడేందుకు వెళ్లిన ముగ్గురు వ్య‌క్తులు కూడా ఉన్నారని అన్నారు.

వ‌స్త్ర దుకాణ‌దారులు, ఫ‌ర్నీచ‌ర్ షాపులతో పాటు ఇత‌ర వ్యాపారాలు చేసిన‌ వారు.. వారి నిలువ‌ల‌ను మెట్ల మార్గంలో, కారిడార్‌లో, సెల్లార్ల‌లో నిలువ ఉంచ‌రాదని స్ప‌ష్టం చేశారు క‌మిష‌న‌ర్. ఇందుకు ప్ర‌త్యేకంగా జ‌న సంచారం లేని ప్రాంతాల్లో గోదాముల్లో నిలువ ఉంచుకోవాలని అన్నారు. సెల్లార్ లు వాహ‌నాల పార్కింగ్ కోస‌మే వినియోగించాలి. పేలుడు, మండే స్వ‌భావం ఉన్న వ‌స్తువులు, ప‌దార్థాలు నిల్వ ఉంచ‌రాద‌ని పేర్కొన్నారు. వ్యాపార స‌ముదాయాల్లో నివాసాలు ఏర్పాటు చేయ‌రాద‌ని సూచించారు. అలాగే సెల్లార్ల‌లో వ‌ర్క‌ర్లు, వాచ్ మ్యాన్ కుటుంబాల‌కు గ‌దులు కేటాయించ‌డం చేయ రాద‌న్నారు. సెల్లార్ నుంచి టెర్రాస్ వ‌ర‌కూ మెట్ల మార్గాలను ఎట్టి పరిస్థితులలో బ్లాక్‌, లాక్ చేయొద్ద‌న్నారు. షాపులు, వ్యాపార స‌ముదాయాల్లో ఉన్న అగ్ని నియంత్రణ పరికరాలు ఎల్లవేళలా పని చేసే విధంగా ఉంచుతూ, సిబ్బందికి అగ్ని పరికరాలపై తగిన అవ‌గాహ‌న క‌ల్పించాలని సూచించారు ఏవీ రంగ‌నాథ్.

  • Related Posts

    రాబోయే భ‌విష్య‌త్తును నిర్దేశించేది ఏఐనే

    చెన్నై : : ‘దేశమే ప్రథమం’ అనే సూత్రానికి కట్టుబడి, తమ జ్ఞానం, ఆవిష్కరణలు , నైపుణ్యాలను దేశ నిర్మాణానికి వినియోగించాలని ఉప రాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్ పట్టభద్రులను కోరారు. చెన్నై సమీపంలోని కట్టంకుళత్తూరులో ఉన్న ఎస్.ఆర్.ఎం. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్…

    తెలంగాణ ‘సేఫ్’ డైర‌క్ట‌ర్ గా అవినాష్ మొహంతి

    హైద‌రాబాద్ : తెలంగాణ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఇప్ప‌టికే స‌మ‌ర్థ‌వంత‌మైన పోలీస్ ఆఫీస‌ర్ గా గుర్తింపు పొందారు అవినాష్ మొహంతి. ఆయ‌న‌కు కీల‌క ప‌ద‌వి క‌ట్ట‌బెట్టింది . సేఫ్ డైరెక్ట‌ర్ గా నియ‌మించింది. గతంలో తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *