అన‌కాప‌ల్లి ఉత్స‌వ్ కోసం భారీ ఏర్పాట్లు

ప‌రిశీలించిన అనిత వంగ‌ల‌పూడి

విశాఖ‌ప‌ట్నం జిల్లా : రాష్ట్ర హొం శాఖ మంత్రి వంగ‌ల‌పూడి అనిత కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. రాష్ట్రంలో ప‌ర్యాట‌క రంగానికి స‌ర్కార్ ప్ర‌యారిటీ ఇస్తోంద‌న్నారు. ఇప్ప‌టికే సాంస్కృతిక ఉత్స‌వాల‌కు పెద్ద ఎత్తున స్పంద‌న ల‌భించింద‌ని చెప్పారు. ఇందులో భాగంగా గురువారం అన‌కాప‌ల్లిని సంద‌ర్శించారు మంత్రి.
ఈ నెల 30, 31 తేదీల్లో జరగనున్న అనకాపల్లి ఉత్సవ్ ఏర్పాట్లను పరిశీలించారు. ముత్యాలమ్మ పాలెం తీరంలో కలెక్టర్ విజయకృష్ణన్ , ఎస్పీ తుహీన్ సిన్హా , ఎమ్మెల్యే శ్రీ పంచకర్ల రమేశ్ తో కలిసి ఏర్పాట్లు పరిశీలించారు. అధికారులకు తగిన సూచనలు చేశారు.

ముత్యాలమ్మ పాలెం తీరంతో పాటు కొండకర్ల ఆవలో ఏర్పాటు చేసిన కార్యక్రమాలపై అధికారులతో చర్చించారు హొం శాఖ మంత్రి వంగ‌ల‌పూడి అనిత‌. భారీ ఎత్తున ప్రజలు హాజరు కానున్నందున ఏర్పాట్లలో లోపాలు లేకుండా ఉండాల‌ని ఆదేశించారు. ఏ ఒక్క చిన్న త‌ప్పు జ‌రిగినా అది ప్ర‌భుత్వానికి చెడ్డ పేరు వ‌స్తుంద‌ని పేర్కొన్నారు వంగ‌ల‌పూడి అనిత‌. అనకాపల్లి ప్రతిష్టను పెంచేలా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. ఇప్ప‌టికే ప్ర‌భుత్వం ఏర్పాట్ల కోసం భారీ ఎత్తున నిధులు కూడా మంజూరు చేసింద‌ని వెల్ల‌డించారు.

  • Related Posts

    రాబోయే భ‌విష్య‌త్తును నిర్దేశించేది ఏఐనే

    చెన్నై : : ‘దేశమే ప్రథమం’ అనే సూత్రానికి కట్టుబడి, తమ జ్ఞానం, ఆవిష్కరణలు , నైపుణ్యాలను దేశ నిర్మాణానికి వినియోగించాలని ఉప రాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్ పట్టభద్రులను కోరారు. చెన్నై సమీపంలోని కట్టంకుళత్తూరులో ఉన్న ఎస్.ఆర్.ఎం. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్…

    తెలంగాణ ‘సేఫ్’ డైర‌క్ట‌ర్ గా అవినాష్ మొహంతి

    హైద‌రాబాద్ : తెలంగాణ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఇప్ప‌టికే స‌మ‌ర్థ‌వంత‌మైన పోలీస్ ఆఫీస‌ర్ గా గుర్తింపు పొందారు అవినాష్ మొహంతి. ఆయ‌న‌కు కీల‌క ప‌ద‌వి క‌ట్ట‌బెట్టింది . సేఫ్ డైరెక్ట‌ర్ గా నియ‌మించింది. గతంలో తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *