మోదీ కేంద్ర బ‌డ్జెట్ బ‌క్వాస్ : ష‌ర్మిలా రెడ్డి

ఎన్డీయేలో కీల‌క పాత్ర పోషించినా ఫాయిదా ఏదీ

విజ‌య‌వాడ : కేంద్రం ప్ర‌వేశ పెట్టిన బ‌డ్జెట్ వ‌ల్ల ఏపీకి ఎలాంటి ప్ర‌యోజ‌నం చేకూర‌లేద‌ని ఆరోపించారు ఏపీపీసీసీ చీఫ్ వైఎస్ ష‌ర్మిలా రెడ్డి. ప్రత్యేక హోదాపై ఊసే లేద‌న్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ పై కనికరం కలగలేదని వాపోయారు. కడప స్టీల్ వైపు కన్నెత్తి కూడా చూడలేదంటూ మండిప‌డ్డారు. మెట్రో రైలు ప్రస్తావన లేక పోవ‌డం దారుణ‌మ‌న్నారు. మెట్రో కారిడార్ల సంగతి తేల్చక పోవ‌డం విడ్డూరంగా ఉంద‌న్నారు ష‌ర్మిలా రెడ్డి. పట్టుమని 10 పైసల మందం కూడా బడ్జెట్ తో ప్రయోజనం లేదంటూ ఫైర్ అయ్యారు.

ఢిల్లీ తలదన్నే రాజధాని కడతామని అప్పులు అంటగట్టడం దుర్మార్గం అన్నారు. లక్ష కోట్లు ఖర్చయ్యే అమరావతికి ADB, జపాన్ బ్యాంకుల నుంచి 15 వందల కోట్లు అప్పులిప్పిస్తే రాజధాని పూర్తవుతుందా ? గతేడాది అప్పుల కింద ఇస్తామని చెప్పిన 15 వేల కోట్లలో ఒక్క రూపాయి అయినా ఇచ్చారా ? గ్యారెంటీ కింద అప్పులు అంటే..ఎవరికి గ్యారెంటీ ? విభజన చట్టం ప్రకారం అమరావతి నిర్మాణం కేంద్రానిదే బాధ్యత అని తెలియదా ? అని నిల‌దీశారు అప్పులు ఇస్తామని చెప్తే ఆంధ్రుల ఆత్మగౌరవం ఎప్పడు పూర్తవుతుంది ? ఇదేనా బీజేపీ కి రాష్ట్రంపై ఉన్న చిత్తశుద్ధి అంటూ ష‌ర్మిలా రెడ్డి నిప్పులు చెరిగారు.

  • Related Posts

    రాబోయే భ‌విష్య‌త్తును నిర్దేశించేది ఏఐనే

    చెన్నై : : ‘దేశమే ప్రథమం’ అనే సూత్రానికి కట్టుబడి, తమ జ్ఞానం, ఆవిష్కరణలు , నైపుణ్యాలను దేశ నిర్మాణానికి వినియోగించాలని ఉప రాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్ పట్టభద్రులను కోరారు. చెన్నై సమీపంలోని కట్టంకుళత్తూరులో ఉన్న ఎస్.ఆర్.ఎం. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్…

    తెలంగాణ ‘సేఫ్’ డైర‌క్ట‌ర్ గా అవినాష్ మొహంతి

    హైద‌రాబాద్ : తెలంగాణ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఇప్ప‌టికే స‌మ‌ర్థ‌వంత‌మైన పోలీస్ ఆఫీస‌ర్ గా గుర్తింపు పొందారు అవినాష్ మొహంతి. ఆయ‌న‌కు కీల‌క ప‌ద‌వి క‌ట్ట‌బెట్టింది . సేఫ్ డైరెక్ట‌ర్ గా నియ‌మించింది. గతంలో తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *