newsseals.com
SPORTS

సంజూ శాంస‌న్ అద్భుత‌మైన బ్యాట్స్ మెన్

VijayaBhaskar February 2, 2026
newsseals-RajivShukla
Spread the love

బీసీసీఐ వైస్ ప్రెసిడెంట్ రాజీవ్ శుక్లా

ముంబై : కేర‌ళ స్టార్ క్రికెట‌ర్ సంజూ శాంస‌న్ గురించి ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు బీసీసీఐ వైస్ ప్రెసిడెంట్ రాజీవ్ శుక్లా. ఆయ‌న జాతీయ మీడియాతో మాట్లాడారు. ఫామ్ లోకి రావ‌డం కోల్పోవ‌డం అనేది ఆట‌లో ష‌రా మామూలేన‌ని అన్నాడు. అలాగని ఏ ఆట‌గాడిని త‌క్కువ అంచ‌నా వేసేందుకు వీలు లేద‌న్నాడు. తాజాగా న్యూజిలాండ్ తో జ‌రిగిన టి20 సీరీస్ ను భార‌త్ గెలుచు కోవ‌డం ప‌ట్ల సంతోషం వ్య‌క్తం చేశారు. ఇదే హవా టి20 వ‌ర‌ల్డ్ క‌ప్ లో కొన‌సాగుతుంద‌ని ఆశాభావం వ్య‌క్తం చేశాడు. అయితే ఈసీరిస్ లో దారుణంగా ఫెయిల్ కావ‌డం ప‌ట్ల శాంస‌న్ కు స‌పోర్ట్ ఇచ్చాడు. ఫామ్ అనేది తాత్కాలిక‌మ‌ని, క్లాస్ శాశ్వ‌త‌మ‌ని స్ప‌ష్టం చేశాడు రాజీవ్ శుక్లా.

సంజూ శాంస‌న్ చాలా అనుభ‌వం క‌లిగిన ఆట‌గాడు అని, అద్భుత‌మైన బ్యాట‌ర్ అని ప్ర‌శంస‌లు కురిపించాడు. త‌ను వ‌ర‌ల్డ్ క‌ప్ లో ఆడ‌తాడ‌ని చూచూయిగా చెప్పాడు. దీంతో త‌న‌ను ఆడిస్తారా లేదా అన్న అనుమానాల‌కు చెక్ పెట్టే ప్ర‌య‌త్నం చేశాడు రాజీవ్ శుక్లా. మ‌రో వైపు ఇషాన్ కిష‌న్ రెండు సంవ‌త్స‌రాల త‌ర్వాత ఫుల్ ఫామ్ లోకి వ‌చ్చాడు. తిరువ‌నంత‌పురం వేదిక‌గా కీవీస్ పై సూప‌ర్ సెంచ‌రీ చేశాడు. అంద‌రి నోళ్లు మూయించాడు. త‌ను సూర్య‌తో క‌లిసి దుమ్ము రేపాడు. ఈ త‌రుణంలో ఓపెన‌ర్ గా త‌నే క‌రెక్టు అని, త‌న‌ను వికెట్ కీప‌ర్ గా కూడా వాడుకుంటామ‌ని చెప్ప‌క‌నే చెప్పాడు గంభీర్.