అంబ‌టి ఇంటిపై దాడి ప‌ట్ల హైకోర్టు సీరియ‌స్

మాజీ మంత్రి కుటుంబానికి భ‌ద్ర‌త క‌ల్పించండి

అమ‌రావ‌తి : మాజీ మంత్రి అంబ‌టి రాంబాబు ఇంటిపై దాడి ఘ‌ట‌న‌కు సంబంధించి విచార‌ణ చేప‌ట్టిన రాష్ట్ర హైకోర్టు తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది. రాష్ట్రంలో శాంతి భ‌ద్ర‌త‌లు అనేవి ఉన్నాయా అన్న అనుమానం క‌లుగుతోంద‌ని పేర్కొంది. ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడుపై అనుచిత వ్యాఖ్య‌లు చేశారంటూ తెలుగుదేశం పార్టీకి చెందిన నేత‌లు, కార్య‌క‌ర్త‌లు మాజీ మంత్రి అంబ‌టి రాంబాబుపై హ‌త్యా య‌త్నానికి పాల్ప‌డ్డారు. ఆపై ఆయ‌న ఇంటికి, కారుకు నిప్పంటించారు. అంతే కాకుండా ఆఫీసును ధ్వంసం చేశారు. ఫ‌ర్నీచ‌ర్ ను చింద‌ర వంద‌ర చేసి ప‌నికి రాకుండా చేసేశారు. ఆయ‌న కుటుంబీకుల‌ను భ‌య‌భ్రాంతుల‌కు గురి చేశారు.

దీనిపై తీవ్ర ఆవేద‌న చెందారు మాజీ మంత్రి అంబ‌టి రాంబాబు భార్య విజ‌య‌ల‌క్ష్మి. తాము ఏపీ కూట‌మి స‌ర్కార్ హ‌యాంలో బ‌తికే ప‌రిస్థితులు లేవంటూ వాపోయారు. త‌మ ఇంటి మీద విచ‌క్ష‌ణా ర‌హితంగా దాడి చేశార‌ని, త‌న భ‌ర్త‌ను చంపేందుకు ప్ర‌య‌త్నం చేశారంటూ పేర్కొంటూ హైకోర్టును ఆశ్ర‌యించారు. ఈ మేర‌కు పిటిష‌న్ దాఖ‌లు చేశారు. దీనిపై విచార‌ణ చేప‌ట్టిన కోర్టు సీరియ‌స్ అయ్యింది. అంబటి రాంబాబు కుటుంబానికి 24 గంటల భద్రత క‌ల్పించాల‌ని రాష్ట్ర ప్ర‌భుత్వాన్ని ఆదేశించింది. శాంతి భద్రతలు అదుపులోకి వచ్చేవరకు భద్రత ఇవ్వాలని స్ప‌ష్టం చేసింది.

  • Related Posts

    రాబోయే భ‌విష్య‌త్తును నిర్దేశించేది ఏఐనే

    చెన్నై : : ‘దేశమే ప్రథమం’ అనే సూత్రానికి కట్టుబడి, తమ జ్ఞానం, ఆవిష్కరణలు , నైపుణ్యాలను దేశ నిర్మాణానికి వినియోగించాలని ఉప రాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్ పట్టభద్రులను కోరారు. చెన్నై సమీపంలోని కట్టంకుళత్తూరులో ఉన్న ఎస్.ఆర్.ఎం. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్…

    తెలంగాణ ‘సేఫ్’ డైర‌క్ట‌ర్ గా అవినాష్ మొహంతి

    హైద‌రాబాద్ : తెలంగాణ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఇప్ప‌టికే స‌మ‌ర్థ‌వంత‌మైన పోలీస్ ఆఫీస‌ర్ గా గుర్తింపు పొందారు అవినాష్ మొహంతి. ఆయ‌న‌కు కీల‌క ప‌ద‌వి క‌ట్ట‌బెట్టింది . సేఫ్ డైరెక్ట‌ర్ గా నియ‌మించింది. గతంలో తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *