త్యాగ ధ‌నుడు రావి నారాయ‌ణ రెడ్డి

మ‌హ‌నీయుడ‌న్న సీఎం రేవంత్ రెడ్డి

హైద‌రాబాద్ : తెలంగాణ ప్రజల స్వేచ్ఛ కోసం, పేదల హక్కుల కోసం పోరాటం చేయడమే కాదు, సర్వం త్యాగం చేసిన మహనీయుడు రావి నారాయణ రెడ్డి అని కొనియాడారు రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి. తెలంగాణ అమరవీరుల స్మారక ట్రస్టు ఆధ్వర్యంలో హైదరాబాద్ బంజారాహిల్స్ లోని రావి నారాయణ రెడ్డి ఆడిటోరియంలో జస్టిస్ బి. సుదర్శన్ రెడ్డికి “రావి నారాయణరెడ్డి జాతీయ పురస్కార” ప్రదానోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సంద‌ర్భంగా సీఎం ప్ర‌సంగించారు.
న్యాయ వ్యవస్థ ద్వారా ప్రజల హక్కుల కోసం పని చేసిన, రాజ్యాంగం పట్ల సంపూర్ణ నిబద్ధత కలిగిన జస్టిస్ బి. సుదర్శన్ రెడ్డికి ఈ అవార్డు ప్రదానం చేయడం అత్యంత సముచితం అని అన్నారు రేవంత్ రెడ్డి.

నేడు దేశంలో రాజ్యాంగ పరిరక్షణ కోసం, ప్రజల ఓటు హక్కు రక్షణ కోసం, ప్రజాస్వామ్య పునరుద్ధరణ కోసం రావి నారాయణ రెడ్డి స్ఫూర్తితో పని చేయాల్సిన అవసరం ఉందన్నారు సీఎం. ఇవాళ రాజ్యాంగం ప్రమాదాన్ని ఎదుర్కొంటోంద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. దీనిని ప‌రిర‌క్షించు కోవాల్సిన బాధ్య‌త ప్ర‌తి ఒక్క‌రిపై ఉంద‌ని ఆ విష‌యాన్ని గుర్తించాల‌ని కోరారు. ఈ కార్యక్రమంలో సీపీఐ నాయకులు నారాయణ, చాడ వెంకట్ రెడ్డి, పల్లా వెంకట్ రెడ్డి, ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం, ప్రొఫెసర్ కోదండరాం రెడ్డి, ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

  • Related Posts

    రాబోయే భ‌విష్య‌త్తును నిర్దేశించేది ఏఐనే

    చెన్నై : : ‘దేశమే ప్రథమం’ అనే సూత్రానికి కట్టుబడి, తమ జ్ఞానం, ఆవిష్కరణలు , నైపుణ్యాలను దేశ నిర్మాణానికి వినియోగించాలని ఉప రాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్ పట్టభద్రులను కోరారు. చెన్నై సమీపంలోని కట్టంకుళత్తూరులో ఉన్న ఎస్.ఆర్.ఎం. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్…

    తెలంగాణ ‘సేఫ్’ డైర‌క్ట‌ర్ గా అవినాష్ మొహంతి

    హైద‌రాబాద్ : తెలంగాణ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఇప్ప‌టికే స‌మ‌ర్థ‌వంత‌మైన పోలీస్ ఆఫీస‌ర్ గా గుర్తింపు పొందారు అవినాష్ మొహంతి. ఆయ‌న‌కు కీల‌క ప‌ద‌వి క‌ట్ట‌బెట్టింది . సేఫ్ డైరెక్ట‌ర్ గా నియ‌మించింది. గతంలో తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *