newsseals.com
News

విధ్వంసం కాదు అభివృద్ధే టీడీపీ ఎజెండా

VijayaBhaskar February 3, 2026
newsseals-PallaSrinivasaRao
Spread the love

స్ప‌ష్టం చేసిన టీడీపీ చీఫ్ ప‌ల్లా శ్రీ‌నివాస రావు

మంగ‌ళగిరి : ఏపీ తెలుగుదేశం పార్టీ అధ్య‌క్షుడు ప‌ల్లా శ్రీ‌నివాస రావు కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. తప్పు చేస్తే పార్టీతో సంబంధం లేకుండా ఎంత వారినైనా చట్టం ప్రకారమే శిక్షిస్తాం అన్నారు. టీడీపీ శ్రేణులు చట్టాన్ని చేతుల్లోకి తీసుకోకూడదని స్ప‌ష్టం చేశారు. దాడులు చేయడం మన పార్టీ సంస్కృతి కాదని సీఎం చంద్రబాబు స్పష్టంగా చెప్పారని మ‌రోసారి గుర్తు చేశారు ప‌ల్లా శ్రీ‌నివాస రావు. గత 45 ఏళ్ల టీడీపీ ప్రస్థానంలో ప్రతిపక్షంలో ఉన్నా అధికారంలో ఉన్నా అభివృద్ధి సంక్షేమం కోసమే పనిచేశాం అని అన్నారు. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పనిచేశాం అని పేర్కొన్నారు. వైసీపీ బూతు రాజకీయాలపై ప్రతి వేదికపై నిలదీద్దాం అని పిలుపునిచ్చారు టీడీపీ చీఫ్‌. ప్రజలకు వైసీపీ కుట్రలను తేలియజేద్దాం. చట్టాన్ని చేతుల్లోకి తీసుకొని హింసను రేక్కెత్తించడం మన సంస్కృతి కానే కాద‌న్నారు.

దేశంలోనే గొప్ప నాయకుడు చంద్రబాబు నాయుడు అని అన్నారు ప‌ల్లా శ్రీ‌నివాస రావు. ఆయనపై గతంలో ఎన్నో తప్పుడు కేసులు పెట్టినా కోర్టులు అవన్నీ కొట్టివేశాయని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో నిలిపేలా సీఎం చంద్రబాబు విజన్ తో పనిచేస్తున్నారని అన్నారు. అభివృద్ధి చెందిన రాష్ట్రాలతో పోటీ పడుతూ పెట్టుబడులు సాధించారు. ప్రపంచ దిగ్గజ కంపెనీలను రాష్ట్రానికి తీసుకొచ్చారు. ఎన్ని అక్రమ కేసులు పెట్టినా అవన్ని తప్పుడు కేసులే అని కోర్టులు తీర్పులిచ్చాయని పేర్కొన్నారు. దీనిని జగన్ రెడ్డి సహించలేక అల్లర్లు సృష్టించే ప్రయత్నం చేస్తున్నారని ఆవేద‌న వ్య‌క్తం చేశారు.