కేఎల్ఎస్ఆర్ కంపెనీ రేవంత్ రెడ్డికి బినామీ

సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేసిన కేటీఆర్

హైద‌రాబాద్ : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. ఆయ‌న మీడియాతో మాట్లాడారు. కేఎల్ఎస్ఆర్ అనే కంపెనీ రేవంత్ రెడ్డికి బినామీ అని పేర్కొన్నారు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కాకముందే ఆ కంపెనీ ఆయనకు కారును బహుమతిగా ఇచ్చిందన్నారు. 2018లో రేవంత్ రెడ్డిపై ఐటీ, ఈడీ దాడులు జరిగినప్పుడు, కేఎల్ఎస్ఆర్ బహుశా వారి షెల్ కంపెనీ అయి ఉండవచ్చని ఏజెన్సీలు కూడా చెప్పాయన్నారు. కేఎల్ఎస్ఆర్ కంపెనీ నుండి వచ్చిన డబ్బును ఆయన కుటుంబ సభ్యుల కంపెనీలలో పెట్టుబడిగా పెట్టారని ఆరోపించారు.

తమ ఉద్యోగులకు జీతాలు చెల్లించడానికి కూడా డబ్బు లేని ఆ కంపెనీకి రూ. 6000 కోట్ల విలువైన ప్రభుత్వ పనులను అప్పగించారని ఆర‌పించారు. దీనిపై విచార‌ణ జ‌ర‌గాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అలాంటి కంపెనీకి ప్రభుత్వ పనులు ఎందుకు అప్పగించారని ప్ర‌శ్నించారు కేటీఆర్. కేంద్ర ప్రభుత్వం కూడా కేంద్ర ఏజెన్సీలను పంపి విచారణ జరిపి, నిజాన్ని ప్రజల ముందు ఉంచాలని డిమాండ్ చేశారు. ఈ కంపెనీ యజమాని ఎవరు?… దీనిపై సమగ్ర విచారణ జరపాలని అన్నారు.

  • Related Posts

    రాబోయే భ‌విష్య‌త్తును నిర్దేశించేది ఏఐనే

    చెన్నై : : ‘దేశమే ప్రథమం’ అనే సూత్రానికి కట్టుబడి, తమ జ్ఞానం, ఆవిష్కరణలు , నైపుణ్యాలను దేశ నిర్మాణానికి వినియోగించాలని ఉప రాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్ పట్టభద్రులను కోరారు. చెన్నై సమీపంలోని కట్టంకుళత్తూరులో ఉన్న ఎస్.ఆర్.ఎం. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్…

    తెలంగాణ ‘సేఫ్’ డైర‌క్ట‌ర్ గా అవినాష్ మొహంతి

    హైద‌రాబాద్ : తెలంగాణ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఇప్ప‌టికే స‌మ‌ర్థ‌వంత‌మైన పోలీస్ ఆఫీస‌ర్ గా గుర్తింపు పొందారు అవినాష్ మొహంతి. ఆయ‌న‌కు కీల‌క ప‌ద‌వి క‌ట్ట‌బెట్టింది . సేఫ్ డైరెక్ట‌ర్ గా నియ‌మించింది. గతంలో తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *