రాష్ట్ర అభివృద్దిపై కూట‌మి స‌ర్కార్ ఫోక‌స్

స్ప‌ష్టం చేసిన మంత్రి వంగ‌ల‌పూడి అనిత

అమ‌రావ‌తి : త‌మ ప్ర‌భుత్వం రాష్ట్ర అభివృద్దిపై ఫుల్ ఫోక‌స్ పెట్టింద‌ని స్ప‌ష్టం చేశారు రాష్ట్ర హోం శాఖ మంత్రి వంగ‌ల‌పూడి అనిత‌. రాష్ట్ర సచివాలయంలో సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు అధ్య‌క్ష‌త‌న జ‌రిగిన కీల‌క స‌మావేశంలో స‌హ‌చ‌ర మంత్రుల‌తో క‌లిసి పాల్గొన్నారు. ఈ సంద‌ర్బంగా ప‌లు కీల‌క సూచ‌న‌లు చేశారు. మీటింగ్ అనంత‌రం మంత్రి మీడియాతో మాట్లాడారు. దేశంలో ఎక్క‌డా లేని విధంగా రాష్ట్రానికి పెద్ద ఎత్తున పెట్టుబ‌డులు వ‌చ్చాయ‌ని చెప్పారు. ప‌ర్యాట‌క‌, లాజిస్టిక్, ఐటీకి ఏపీని కేరాఫ్ గా మార్చేందుకు ముఖ్య‌మంత్రి నారా చంద్రబాబు నాయుడు పెద్ద ఎత్తున ప్ర‌య‌త్నం చేస్తున్నాడ‌ని తెలిపారు.

ప‌ర్యాట‌క, సాంస్కృతిక హ‌బ్ గా మారుస్తున్నార‌ని తెలిపారు. ఇటీవ‌లే టీటీడీ ఆధ్వ‌ర్యంలో భారీ ఎత్తున నిర్వ‌హించిన వైకుంఠ ఏకాద‌శి ద‌ర్శ‌నాలు స‌క్సెస్ అయ్యాయ‌ని చెప్పారు. రాష్ట్రంలో శాంతి భ‌ద్ర‌త‌ల‌ను ప‌రిరక్షించ‌డంలో పోలీసులు కీల‌క పాత్ర పోషిస్తున్నారని అన్నారు వంగ‌ల‌పూడి అనిత‌. విశాఖ‌లో వ‌ర‌ల్డ్ లోనే తొలిసారిగా గూగుల్ డేటా సెంట‌ర్ ను నెల‌కొల్పింద‌ని చెప్పారు. దీని వ‌ల్ల విశాఖ ప‌ట్ట‌ణం మ‌రింత విస్త‌రించే ఛాన్స్ ఉంద‌న్నారు . స‌మ‌ర్థ‌వంత‌మైన నాయ‌క‌త్వంలో ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రం అన్ని రంగాల‌లో దూసుకు పోవ‌డం ఖాయ‌మ‌ని ధీమా వ్య‌క్తం చేశారు.

  • Related Posts

    రాబోయే భ‌విష్య‌త్తును నిర్దేశించేది ఏఐనే

    చెన్నై : : ‘దేశమే ప్రథమం’ అనే సూత్రానికి కట్టుబడి, తమ జ్ఞానం, ఆవిష్కరణలు , నైపుణ్యాలను దేశ నిర్మాణానికి వినియోగించాలని ఉప రాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్ పట్టభద్రులను కోరారు. చెన్నై సమీపంలోని కట్టంకుళత్తూరులో ఉన్న ఎస్.ఆర్.ఎం. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్…

    తెలంగాణ ‘సేఫ్’ డైర‌క్ట‌ర్ గా అవినాష్ మొహంతి

    హైద‌రాబాద్ : తెలంగాణ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఇప్ప‌టికే స‌మ‌ర్థ‌వంత‌మైన పోలీస్ ఆఫీస‌ర్ గా గుర్తింపు పొందారు అవినాష్ మొహంతి. ఆయ‌న‌కు కీల‌క ప‌ద‌వి క‌ట్ట‌బెట్టింది . సేఫ్ డైరెక్ట‌ర్ గా నియ‌మించింది. గతంలో తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *