రాజకీయ వ్యభిచారి కాంగ్రెస్ పార్టీ : బండి సంజ‌య్

గాంధీభవన్ లోనే ఫిరాయింపు ఎమ్మెల్యేల సంసారం

క‌రీంన‌గ‌ర్ జిల్లా : కేంద్ర హొం శాఖ స‌హాయ మంత్రి బండి సంజ‌య్ కుమార్ ప‌టేల్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. రాష్ట్రంలో కొలువు తీరిన కాంగ్రెస్ పార్టీ నిర్వాకంపై భ‌గ్గుమ‌న్నారు. కాంగ్రెస్ పార్టీ నైతిక విలువ‌ల‌కు తిలోద‌కాలు ఇచ్చింద‌ని ఆరోపించారు. రాజ‌కీయ వ్య‌భిచారం చేస్తోందంటూ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు బండి సంజ‌య్ కుమార్ ప‌టేల్. జిల్లా కాంగ్రెస్ ఆఫీసుల్లో మీటింగులు పెట్ట‌డం, వాళ్లే బీ-ఫామ్ పంచుతున్నారంటూ పేర్కొన్నారు. ప్ర‌జాస్వామ్యాన్ని కాపాడాల్సిన తెలంగాణ అసెంబ్లీ స్పీక‌ర్ గ‌డ్డం ప్ర‌సాద్ కుమార్ నిమ్మ‌కు నీరెత్తిన‌ట్లు వ్య‌వ‌హ‌రించ‌డం దారుణ‌మ‌న్నారు కేంద్ర మంత్రి.

ఇది పూర్తిగా రాజ్యాంగ స్పూర్తికి విరుద్ద‌మ‌న్నారు. స్పీక‌ర్ క‌ళ్లుండి క‌బోధిగా మారారంటూ మండిప‌డ్డారు బండి సంజ‌య్ కుమార్ ప‌టేల్. స్పీకర్ పదవికి మచ్చ తేవడం న్యాయమేనా అని ప్ర‌శ్నించారు . ప్రజలు అన్నీ గ‌మ‌నిస్తున్నార‌ని చెప్పారు. వాళ్లు ఏ పార్టీలో ఉన్నారు.. ఎందుకు ఓటేయాలని అడగాల‌ని ప్ర‌జ‌ల‌కు పిలుపునిచ్చారు . ఓట్ల కోసం వచ్చే ఫిరాయింపు ఎమ్మెల్యేలను నిలదీయాల‌ని అన్నారు. ఇక‌నైనా మేలు కోవాల‌ని లేక‌పోతే తీవ్ర ఇబ్బందులు ప‌డాల్సి వ‌స్తుంద‌ని హెచ్చ‌రించారు. .

  • Related Posts

    రాబోయే భ‌విష్య‌త్తును నిర్దేశించేది ఏఐనే

    చెన్నై : : ‘దేశమే ప్రథమం’ అనే సూత్రానికి కట్టుబడి, తమ జ్ఞానం, ఆవిష్కరణలు , నైపుణ్యాలను దేశ నిర్మాణానికి వినియోగించాలని ఉప రాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్ పట్టభద్రులను కోరారు. చెన్నై సమీపంలోని కట్టంకుళత్తూరులో ఉన్న ఎస్.ఆర్.ఎం. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్…

    తెలంగాణ ‘సేఫ్’ డైర‌క్ట‌ర్ గా అవినాష్ మొహంతి

    హైద‌రాబాద్ : తెలంగాణ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఇప్ప‌టికే స‌మ‌ర్థ‌వంత‌మైన పోలీస్ ఆఫీస‌ర్ గా గుర్తింపు పొందారు అవినాష్ మొహంతి. ఆయ‌న‌కు కీల‌క ప‌ద‌వి క‌ట్ట‌బెట్టింది . సేఫ్ డైరెక్ట‌ర్ గా నియ‌మించింది. గతంలో తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *