సీబీఐ క్లీన్ చిట్ ఇవ్వ‌లేదు : ప‌వ‌న్ క‌ళ్యాణ్

తిరుమ‌ల ల‌డ్డూకి క‌ల్తీ నెయ్యి వాడార‌ని ఆరోప‌ణ‌

అమరావ‌తి : ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. తిరుమ‌ల ల‌డ్డూ త‌యారీలో క‌ల్తీ నెయ్యి వాడార‌ని సిట్ నివేదిక తేల్చింద‌న్నారు. ఆయ‌న మీడియాతో మాట్లాడారు. ఏడు కొండల వాడికి రెండు కొండలు చాలు అన్న ఆలోచనా విధానం నుంచి, శ్రీ వెంకటేశ్వర స్వామికి ఉన్నది రెండే కొండలు అన్న వారసత్వం నుంచి పుట్టినవారు తిరుమల పవిత్రతను దిగజార్చేందుకు ఏ స్థాయికైనా దిగజారుతారని స్పష్టం చేశారు. వారు భగవంతుడి మీదే పగ పట్టారన్నారు. భగవంతుడి మీద పగ పట్టిన వారు మట్టికొట్టుకు పోతారని పేర్కొన్నారు . కల్తీ నెయ్యి కేసులో సీబీఐ క్లీన్ చిట్ ఇవ్వలేదని పేర్కొన్నారు. లడ్డూ తయారీకి వినియోగించిన నెయ్యి అసలు పాల నుంచి చేసిందే కాదని రిపోర్టులో పేర్కొన్నట్టు చెప్పారు. చేసిన తప్పుకి క్షమాపణ కోరకుండా ఎదురు మమ్మల్ని క్షమాపణ చెప్పమని బుకాయిస్తున్నారన్నారు.

ఇది హిందూ విశ్వాసాల మీద జరిగిన దాడి. తప్పు చేసిన వారు ఏడుకొండల వాడికి క్షమాపణ చెప్పి తీరాల్సిందేన‌ని స్ప‌ష్టం చేశారు డిప్యూటీ సీఎం. కల్తీ నెయ్యి కేసులో దోషుల్లో ఏ ఒక్కరినీ కూటమి ప్రభుత్వం వదలదని హెచ్చరించారు. మతం, ధర్మం చాలా లోతైన అంశాలు. చాలా సున్నితమైనవి కూడా. అలాంటి వ్యవహారాల్లో ఒక్క మాట మాట్లాడాలన్నా చాలా ఆలోచించి మాట్లాడాలి. ముఖ్యమంత్రి , మేము కూడా మాట్లాడే సమయంలో సంయమనంతో, ఎలాంటి పర్యవసానాలు ఎదుర్కోవాలి అన్నది ఆలోచించే మాట్లాడుతాం అని అన్నారు ప‌వ‌న్ క‌ళ్యాణ్‌.

  • Related Posts

    రాబోయే భ‌విష్య‌త్తును నిర్దేశించేది ఏఐనే

    చెన్నై : : ‘దేశమే ప్రథమం’ అనే సూత్రానికి కట్టుబడి, తమ జ్ఞానం, ఆవిష్కరణలు , నైపుణ్యాలను దేశ నిర్మాణానికి వినియోగించాలని ఉప రాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్ పట్టభద్రులను కోరారు. చెన్నై సమీపంలోని కట్టంకుళత్తూరులో ఉన్న ఎస్.ఆర్.ఎం. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్…

    తెలంగాణ ‘సేఫ్’ డైర‌క్ట‌ర్ గా అవినాష్ మొహంతి

    హైద‌రాబాద్ : తెలంగాణ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఇప్ప‌టికే స‌మ‌ర్థ‌వంత‌మైన పోలీస్ ఆఫీస‌ర్ గా గుర్తింపు పొందారు అవినాష్ మొహంతి. ఆయ‌న‌కు కీల‌క ప‌ద‌వి క‌ట్ట‌బెట్టింది . సేఫ్ డైరెక్ట‌ర్ గా నియ‌మించింది. గతంలో తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *