న‌ల్ల‌గొండ‌ను ఆద‌ర్శ న‌గ‌రంగా మారుస్తాం

ప్ర‌క‌టించిన మంత్రి కోమ‌టి రెడ్డి వెంక‌ట్ రెడ్డి

న‌ల్ల‌గొండ జిల్లా : గ‌త ప్ర‌భుత్వం న‌ల్లగొండ జిల్లాను పూర్తిగా నిర్ల‌క్ష్యం చేసింద‌ని ఆరోపించారు రాష్ట్ర రోడ్లు, భ‌వ‌నాల శాఖ మంత్రి కోమ‌టి రెడ్డి వెంక‌ట్ రెడ్డి. మున్సిప‌ల్ ఎన్నిక‌ల సంద‌ర్బంగా మంత్రి న‌ల్ల‌గొండ‌లో ప్ర‌చారం చేప‌ట్టారు. ఊహించ‌ని రీతిలో ఆయ‌న‌కు ఘ‌న స్వాగ‌తం ప‌లికారు. దీంతో సంతోషానికి లోనైన కోమ‌టిరెడ్డి ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. తాను ఊపిరి ఉన్నంత వ‌ర‌కు న‌ల్ల‌గొండ అభివృద్ది కోసం కృషి చేస్తాన‌ని చెప్పారు. రాష్ట్రంలోనే న‌ల్ల‌గొండ న‌గ‌రాన్ని ఆద‌ర్శ న‌గ‌రంగా తీర్చిదిద్దుతాన‌ని ప్ర‌క‌టించారు. ఇప్ప‌టికే ప‌ట్ట‌ణ అభివృద్ది కోసం వంద‌ల కోట్లు కేటాయించ‌డం జ‌రిగింద‌ని చెప్పారు.

దేశంలో ఎక్క‌డా లేని రీతిలో ప్రజా ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు పేదల జీవితాల్లో మార్పు తీసుకొస్తున్నాయ‌ని అన్నారు కోమ‌టి రెడ్డి వెంక‌ట్ రెడ్డి . 48కి 48 డివిజన్లలో కాంగ్రెస్ కార్పొరేటర్లు గెలిస్తే నల్లగొండ అభివృద్ధికి మరిన్ని నిధులు తీసుకువస్తానని హామీ ఇచ్చారు మంత్రి. హస్తం గుర్తుపై ఓటు వేసి కాంగ్రెస్ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాల‌ని పిలుపునిచ్చారు. ప్ర‌తిప‌క్షాలను గెలిపిస్తే నిధులు ఎలా వ‌స్తాయ‌ని ప్ర‌శ్నించారు. రాష్ట్రంలో ఈసారి జ‌రిగే మున్సిప‌ల్ ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ పార్టీ క్లీన్ స్వీప్ చేయ‌డం ఖాయ‌మ‌ని జోష్యం చెప్పారు కోమ‌టి రెడ్డి వెంక‌ట్ రెడ్డి.

  • Related Posts

    రాబోయే భ‌విష్య‌త్తును నిర్దేశించేది ఏఐనే

    చెన్నై : : ‘దేశమే ప్రథమం’ అనే సూత్రానికి కట్టుబడి, తమ జ్ఞానం, ఆవిష్కరణలు , నైపుణ్యాలను దేశ నిర్మాణానికి వినియోగించాలని ఉప రాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్ పట్టభద్రులను కోరారు. చెన్నై సమీపంలోని కట్టంకుళత్తూరులో ఉన్న ఎస్.ఆర్.ఎం. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్…

    తెలంగాణ ‘సేఫ్’ డైర‌క్ట‌ర్ గా అవినాష్ మొహంతి

    హైద‌రాబాద్ : తెలంగాణ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఇప్ప‌టికే స‌మ‌ర్థ‌వంత‌మైన పోలీస్ ఆఫీస‌ర్ గా గుర్తింపు పొందారు అవినాష్ మొహంతి. ఆయ‌న‌కు కీల‌క ప‌ద‌వి క‌ట్ట‌బెట్టింది . సేఫ్ డైరెక్ట‌ర్ గా నియ‌మించింది. గతంలో తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *