ఫోరెన్సిక్ ల్యాబ్ ఘ‌ట‌న‌పై విచార‌ణ జ‌రిపించాలి

దీని వెనుక ఏదో కుట్ర దాగి ఉంద‌న్న మాజీ మంత్రి కేటీఆర్

హైద‌రాబాద్ : ఓటుకు నోటుకు సంబంధించిన కేసులో కీల‌క‌మైన ఫైళ్లు ద‌గ్దం అయ్యాయ‌న్న అనుమానం ఉంద‌ని పేర్కొన్నారు మాజీ మంత్రి కేటీఆర్. ఆయ‌న మీడియాతో మాట్లాడారు. ఫోరెన్సిక్‌ ల్యాబ్‌ ప్రమాదం ముమ్మాటికీ కుట్రేన‌ని ఆరోపించారు. ఆధారాలు కాలి పోవ‌డంతో అంతా బ‌య‌ట‌కు వస్తార‌ని అన్నారు.
హంతకులు, రేపిస్టులు, దొంగలు ఇప్పుడు సమాజంలో ఇష్టారాజ్యంగా తిరుగుతున్నార‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు కేటీఆర్. ఓటుకు నోటు కేసులో శిక్ష పడుతుందన్న భయంతోనే సాక్ష్యాధారాలను రేవంత్‌ దగ్ధం చేయించాడ‌ని మండిప‌డ్డారు. ల్యాబ్‌ ప్రమాదంపై ప్రజలందరికీ అనుమానాలు ఉన్నాయ‌న్నారు. ముఖ్య‌మైన కార్యాల‌యంలో ఎవ‌రూ ఎందుకు ఉండ‌ర‌ని ప్ర‌శ్నించారు. 3 గంటలైనా మంటలార్పని స్థితిలో అగ్నిమాపక శాఖ ఎందుకు ఉందో చెప్పాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు.

ఫోరెన్సిక్ ల్యాబ్ లో చోటు చేసుకున్న ఫైళ్ల ద‌గ్దం ఘ‌ట‌న‌కు సంబంధించి త‌క్ష‌ణ‌మే రిటైర్డ్ జ‌డ్జి తో విచార‌ణ జ‌రిపించాల‌ని కేటీఆర్ డిమాండ్ చేశారు. అత్యంత కట్టుదిట్టమైన భద్రత కలిగిన ఫోరెన్సిక్‌ ల్యాబ్‌లో చలికాలం అగ్ని ప్రమాదం జరగడమేంది? 24 గంటలు ఉద్యోగులు ఉండాల్సిన చోట ఎవరూ లేక పోవడమేంది? నిన్న ప్రమాదం పెద్దగా జరుగలేదని చెప్పిన ప్రభుత్వం ఈ రోజు మొత్తం 2015 నుంచి పదేండ్లకు సంబంధించి అనేక కేసుల సాక్ష్యాధారాలు పూర్తిగా దగ్ధమయ్యాయని ప్రకటించడం చూస్తుంటే ఇది కచ్చితంగా రేవంత్‌రెడ్డి చేయించిన పనేన‌ని అర్థం అవుతుంద‌న్నారు.

  • Related Posts

    రాబోయే భ‌విష్య‌త్తును నిర్దేశించేది ఏఐనే

    చెన్నై : : ‘దేశమే ప్రథమం’ అనే సూత్రానికి కట్టుబడి, తమ జ్ఞానం, ఆవిష్కరణలు , నైపుణ్యాలను దేశ నిర్మాణానికి వినియోగించాలని ఉప రాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్ పట్టభద్రులను కోరారు. చెన్నై సమీపంలోని కట్టంకుళత్తూరులో ఉన్న ఎస్.ఆర్.ఎం. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్…

    తెలంగాణ ‘సేఫ్’ డైర‌క్ట‌ర్ గా అవినాష్ మొహంతి

    హైద‌రాబాద్ : తెలంగాణ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఇప్ప‌టికే స‌మ‌ర్థ‌వంత‌మైన పోలీస్ ఆఫీస‌ర్ గా గుర్తింపు పొందారు అవినాష్ మొహంతి. ఆయ‌న‌కు కీల‌క ప‌ద‌వి క‌ట్ట‌బెట్టింది . సేఫ్ డైరెక్ట‌ర్ గా నియ‌మించింది. గతంలో తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *